Off The Record: అవనిగడ్డ కూటమిలో పరాకాష్టకు చేరిన ఆధిపత్య పోరు!
- 2024 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి జనసేనలోని మండలి..
- అవనిగడ్డ సీటు జనసేన కోటాలోకి వెళ్ళడంతో మార్పు..
- రెండు పార్టీల మధ్య సఖ్యత బాగా ఉంటుందని అప్పట్లో ఆశలు..
- జనసేన నుంచి గెలిచాక బుద్దప్రసాద్ మారిపోయారా?..
- సీసీ రోడ్ల పనుల్లో టీడీపీని వదిలేసి జనసేన వాళ్ళకే ఇస్తున్నారా?..
- ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన చోటే మళ్లీ టీడీపీ నేతల శంకుస్థాపన..
- శిలాఫలకాలపై పేర్ల విషయంలో ప్రోటోకాల్ రచ్చ..
- ఎమ్మెల్యే కొడుకు, అల్లుడిపై టీడీపీ నేతల ఆరోపణలు..
- టీడీపీ అవనిగడ్డ ఇన్ఛార్జ్ లేకపోవడం మైనస్..
- ఇలాగే ఉంటే మొదటికే మోసం అంటున్న కేడర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి కుమ్ములాటలు ఓ రేంజ్‌లో జరుగుతున్నాయట. సందర్భం ఏదైనాసరే…. రచ్చ కామన్ అయినట్టు చెప్పుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన తరపున గెలిచారు మండలి బుద్ధ ప్రసాద్. అంతకు ముందు టీడీపీ, కాంగ్రెస్ తరపున కూడా శాసనసభ్యుడు అయిన మండలి… 2024 ఎన్నికలకు ముందు అనూహ్యంగా జనసేన కండువా కప్పుకున్నారు. కూటమి పొత్తులో భాగంగా అప్పుడు జనసేన కోటాలోకి వెళ్ళింది ఈ సీటు. ఆ సమయంలో బుద్దప్రసాద్ టిడిపిలోనే ఉన్నారు. టికెట్ తనకు ఇవ్వటం కుదరదని, జనసేనకు ఖాయమన్న సంకేతాలు అధిష్టానం నుంచి రావడంతో తీవ్రంగా నిరాశపడ్డారాయన. సోషల్ మీడియా వేదికగా చాలా ట్వీట్స్ చేశారు. అదే సమయంలో జనసేన స్థానిక కేడర్‌ను కూడా విమర్శించారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అలాంటి నాయకుడు ఊహించని విధంగా చివరి నిమిషంలో జనసేన కండువా కప్పుకొని ఆ పార్టీ అభ్యర్థిగా కూటమి తరుపున బరిలోకి దిగి విజయం సాధించారు. బుద్ధ ప్రసాద్ జనసేన నుంచి గెలిచినప్పటికీ… ఆయన వర్గమంతా టిడిపిలోనే ఉండటంతో రెండు పార్టీల మధ్య బాగా సఖ్యత కుదురుతుందని అంతా భావించారు.
కానీ… ఇప్పుడు చూస్తుంటే సీన్ మొత్తం రివర్స్‌లో ఉందట. జనసేన నుంచి గెలిచిన తర్వాత బుద్దప్రసాద్‌కు టిడిపి స్థానిక నాయకత్వంతో అంతగా పొసగటం లేదన్నది లోకల్ టాక్. ఇందుకు అనేక కారణాలున్నాయంటూ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలో కాంట్రాక్ట్‌లు మొదలు పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్ట్‌ల వరకు ఏ విషయంలోనూ రెండు పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడంతో విభేదాలు రచ్చకెక్కి అసమ్మతి కుంపట్లు మొదలయ్యాయట. నియోజకవర్గం సీసీ రోడ్ల నిర్మాణ పనుల్ని టీడీపీ, జనసేన వారికి సమంగా ఇవ్వాలన్న ప్రతిపాదనలు ఉన్నప్పటికీ… జనసేన వారికే ఎక్కువగా ఇస్తున్నారంటూ స్థానిక తెలుగుదేశం నాయకులు ఆగ్రహంగా ఉన్నారట. ఇటీవల ఒక రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ శంకుస్థాపన చేస్తే… అదే రోడ్డుకి టిడిపి వాళ్ళు మళ్ళీ వచ్చి శంకుస్థాపన చేయటంతో రచ్చ అయింది. ఈ విషయంపై ఎమ్మెల్యే సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని అనడం రాజకీయ చర్చకు చర్చకు కారణమైంది. ఇక రెండు పార్టీల మధ్య ప్రోటోకాల్ వివాదాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయట. నియోజకవర్గంలో భవన నిర్మాణాలు, రోడ్ల ప్రారంభోత్సవాలకు సంబంధించి ఏర్పాటు చేస్తున్న శిలాఫలకాలలో టిడిపి నేతల పేర్లు ఉండకపోవడం పెద్ద ఎత్తున వివాదానికి కారణమైంది. అవనిగడ్డలో ఇటీవల అన్న క్యాంటీన్ ప్రారంభమైంది. ఆ సందర్బంగా ఆవిష్కరించిన శిలాఫలకంలో టీడీపీ దివి మార్కెట్ యార్డు చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు పేరు లేకపోవడంతో వివాదం రేగింది. అది ముదిరి శిలాఫలకం ధ్వంసం వరకు వెళ్లటం పొలిటికల్‌గా కాక రేపింది. టిడిపిలో ఉన్న ముఖ్య నేతలు జనసేనలో చేరితే మంచి పదవులు ఇస్తామని ఎమ్మెల్యే ఆఫర్ చేస్తున్నారన్నది తమ్ముళ్ళ ఆరోపణ.
Also Read
ఇప్పుడు జనసేన నుంచి గెలిచినా… బుద్దప్రసాద్ గతంలో ఎక్కడున్నానన్న సంగతి మర్చిపోతే ఎలాగంటూ ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరగటానికి ఇది కూడా ఒక కారణం అంటున్నారు. పార్టీ మారితే పదవులంటూ ఆఫర్స్‌పై నియోజకవర్గ టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యే మండలి కంటే ఆయన కొడుకు, అల్లుడే ఎక్కువగా కనిపిస్తున్నారని, అన్ని ఆర్థిక వ్యవహారాల్లో వాళ్ళు జోక్యం చేసుకుంటున్నారని మండిపడుతున్నారు తమ్ముళ్ళు. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. నియోజకవర్గంలో ఇసుక, బుసుక అక్రమ రవాణా మొదలు మద్యం అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ బావా బావమరుదుల కనుసన్ననల్లోనే జరుగుతున్నాయన్నది టీడీపీ ఆరోపణ. ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో జరిగిన టిడిపి సమన్వయ సమావేశంలో ఇదే విషయాన్ని స్థానిక టిడిపి నేతలు ప్రస్తావించారు. బహిరంగంగా, సభా వేదిక మీదే మంత్రి దృష్టికి తీసుకెళ్లడం అప్పట్లో చర్చనీయాంశమైంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుమారుడు, అల్లుడు మితిమీరిన జోక్యం వల్ల టిడిపి కూడా ఇబ్బంది పడుతోందన్నది వాళ్ళ వెర్షన్. అదే సమయంలో అవనిగడ్డ నియోజకవర్గ ఇన్చార్జి కూడా టిడిపి తరఫున ఎవరూ లేకపోవడంతో రెండు పార్టీల మధ్య సఖ్యత కుదిరే అవకాశాలు మరింత సన్నగిల్లుతున్నాయట. అయితే… టిడిపి నేతలి చేస్తున్న ఆరోపణలు కేవలం ఆర్థిక కోణంలోనివే తప్ప… అందులో నిజం లేదన్నది జనసేన వర్గాల మాట. మొత్తం మీద కూటమికి కంచుకోటగా ఉన్న అవినిగడ్డలో ఈ సిగపట్లు ఇప్పుడే ఆపకపోతే నష్టం తప్పదన్నది అందరూ అంటున్న మాట.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!