Site icon NTV Telugu

Off The Record: ఢిల్లీకి చంద్రబాబు.. ఏపీ సీఎంగా లోకేష్ మరి పవన్ పరిస్థితి ?

Otr Lokesh Vs Pawan

Otr Lokesh Vs Pawan

Off The Record: ఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడో సరికొత్త చర్చ హాట్‌ హాట్‌గా నడుస్తోంది. ఇక సోషల్‌ మీడియా విశ్లేషణలు, అంచనాలకైతే హద్దే లేదు. సంబంధం ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు… కాస్తంత పొలిటికల్‌ ఇంట్రస్ట్‌ ఉన్న ఏ ఇద్దరు కలిసినా ఇప్పుడు సంధించుకుంటున్న ప్రశ్న ఒక్కటే. సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారటగా అంటూ పరస్పరం క్వశ్చన్‌ మార్క్‌ ఫేస్‌లు పెడుతున్నారు. అదేంటి… ఆయన రెగ్యులర్‌గా ఢిల్లీ వెళ్తుంటారుగా అన్న రొటీన్‌ సెటైర్స్‌కు తావు లేదిక్కడ. చంద్రబాబు పొలిటికల్‌ యాంగిల్‌లో ఢిల్లీ వెళ్తున్నారన్నది ఆ చర్చోప చర్చల సారాంశం. ఆయనకు ఢిల్లీ స్థాయిలో ఏదో పెద్ద పదవి రాబోతోందని, దానికి సంబంధించి కేంద్ర స్థాయిలో మంతనాలు జరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే… ఇక్కడ అదసలు మేటర్‌ కాదు. ఏపీ సీఎం సెంట్రల్‌ పొజిషన్‌ కోసం చూస్తున్నారా, అందుకు బీజేపీ పెద్దలు సుముఖంగా ఉన్నారా అన్నది డిఫరెంట్‌ మేటర్‌. అయితే…. అసలుదానికంటే అనుబంధ చర్చలే ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్‌లో పొగలు పుట్టిస్తున్నాయి. త్వరలోనే ఈ పొగ పెరిగి భగభగ మండుతుందని కూడా అంచనా వేస్తున్నారు కొందరు. చంద్రబాబు ఢిల్లీ వెళ్ళిపోయి… రాష్ట్రంలో ప్రభుత్వ పగ్గాలు లోకేష్‌కు అప్పగిస్తారన్న ఊహాగానాలే అందుకు కారణం.

సరిగ్గా… ఇక్కడే అసలు సిసలైన ట్విస్ట్‌ కూడా ఉంది. ఒకవేళ చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి, ఇక్కడ లోకేష్‌ను సీఎంని చేస్తే…. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇదే పాయింట్‌ మీద వైసీపీ కూడా గేమ్‌ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆ గేమ్‌ ఏ స్థాయిలో ఉండబోతోందన్నది వేరే లెక్కగానీ.. ప్రస్తుతం వైసీపీ కాపు నేతల మధ్య దీనికి సంబంధించి చర్చ జరుగుతోందట. చంద్రబాబు కాని పక్షంలో… పవన్‌కు సీఎం పదవి ఇవ్వాలని, ఆయన్ని కాదని లోకేష్‌కు ఎలా ఇస్తారంటూ లాజిక్‌ తీస్తున్నారట వైసీపీ కాపు నేతలు. దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు బయటపడుతున్నారు. ఇప్పుడు అనుకుంటున్న ఊహాగానాలన్నీ నిజమై…. ఒకవేళ లోకేష్‌ను సీఎంని చేస్తే…. మనోడికి అన్యాయం జరిగిందంటూ కాపు సామాజికవర్గంలో పెద్ద ఎత్తున చర్చపెట్టి పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలన్న అభిప్రాయంతో వైసీపీ ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇన్నేళ్ళలో ఎప్పుడూ లేదు, ఇప్పుడు పరిస్థితులు కాస్త అనుకూలంగా ఉన్నాయి, అందుకే పవన్‌కళ్యాణ్‌ ముఖ్యమంక్రి అవ్వాలంటూ ఆల్రెడీ కొందరు కాపు నాయకులు స్టేట్‌మెంట్స్‌ ఇచ్చి ఉన్నారు. వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ, తోట త్రిమూర్తులు లాంటి నేతలు చిట్‌చాచ్స్‌లో దీనికి సంబంధించి బయటపడుతున్నారట. పవన్‌ సీఎం కావాలన్నది కాపు సామాజికవర్గం చిరకాల కోరిక అని వైసీపీలోని కాపు నేతలు సైతం అంటున్నారట.

ఇప్పుడు ఒకరిద్దరు బయటపడుతున్నా…. ముందు ముందు మిగతా వాళ్ళు కూడా తమ అభిప్రాయం చెప్పవచ్చని అంటున్నారు. చంద్రబాబు సీఎంగా కొనసాగితే ఏ గొడవా లేదు. అలా కాకుండా, జరుగుతున్న ప్రచారం ప్రకారం.. మార్పులు ఉంటే మాత్రం పవన్ సీఎం సీట్లో ఉండాలన్నది కాపు నేతల వాయిస్‌. చంద్రబాబు నాయకత్వంలో 15 ఏళ్ళు కూటమి ఉండాలంటూ పవన్‌కళ్యాణ్‌ పదే పదే చెప్తున్నారని, కానీ చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళితే మాత్రం తప్పనిసరిగా ఆయన్నే సీఎంని చేయాలన్న డిమాండ్‌ కాపు సంఘాల నుంచి వస్తుందని అంటున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తోంది కాపు సామాజికవర్గం. అందుకే అవకాశం వస్తే వదులుకోకూడదని భావిస్తున్నట్టు సమాచారం. అయితే… ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలే. నిజంగానే జరిగితే అసలు సీఎం పదవి నుంచి చంద్రబాబు తప్పుకోవడమన్నదే చాలా పెద్ద పరిణామం. కానీ… గతంలో ఎప్పుడూ లేని విధంగా దీనికి సంబంధించిన ప్రచారం మాత్రం రోజు రోజుకూ పెరిగిపోతోంది. బీహార్‌లో జరిగిన తాజా పరిణామాలతో ఏపీలో కూడా ఈ చర్చలు పెరిగిపోతున్నాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు, ఏదానై సాధ్యమే. మరి ఇప్పుడు ఊపందుకున్న మార్పు ప్రచారాన్ని ప్రభుత్వ పెద్దలు ఖండిస్తారా? లేక సరే… చూద్దాం…. ఇది ఎంత దూరం వెళ్తుందోనని ఎంజాయ్‌ చేస్తారా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌.

Exit mobile version