Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Ap Minister Tg Bharat Issues Strong Warning Amidst Vishnu Reddy Discontent In Kodumur

Off The Record: విష్ణు విషయంలోనే టీజీ అసహనంగా ఉన్నారా..?

Published Date :January 7, 2026 , 9:40 pm
By Sudhakar Ravula
  • నన్ను కెలికితే ఊరుకోబోనంటూ మాస్‌ వార్నింగ్‌..
  • ఇతర నియోజకవర్గాల్లో తాను వేలు పెట్టడం లేదని క్లారిటీ..
  • నేను రాజకీయం చేయాలనుకుంటే తట్టుకోలేరన్న టీజీ భరత్‌..
  • కర్నూల్‌ కార్పొరేషన్‌లోని మూడు డివిజన్స్‌ కోడుమూరు పరిధిలో..
  • కోడుమూరు టీడీపీ ఇన్ఛార్జ్‌గా డీసీసీబీ ఛైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి..
  • విష్ణు విషయంలోనే టీజీ అసహనంగా ఉన్నారా?..
  • ప్రభుత్వ కార్యక్రమంలో ఢీ అంటే ఢీ అన్న రెండు వర్గాలు..
  • సభలో మంత్రి పేరు ఉచ్ఛరించని విష్ణు వర్ధన్‌..
  • విష్ణువర్ధన్‌రెడ్డి వర్గంపై తీవ్ర ఆగ్రహంగా మంత్రి టీజీ వర్గీయులు..
Off The Record: విష్ణు విషయంలోనే టీజీ అసహనంగా ఉన్నారా..?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Off The Record: ఆంధ్రప్రదేశ్‌ మంత్రి టీజీ భరత్‌ సొంత జిల్లాలో ఇచ్చిన మాస్‌ వార్నింగ్‌ ఇప్పుడు పొలిటికల్‌ హాట్‌గా మారిపోయింది. నేను ఒకర్ని కెలకను, నన్ను కెలికితే ఊరోకోబోనంటూ సొంత పార్టీ నాయకులకే ఆయన సీరియస్‌గా హెచ్చరికలు చేయడం గురించి రకరకలా విశ్లేషణలు నడుస్తున్నాయి. మంత్రి హోదాలో ఉండి కూడా… ఇతర నియోజకవర్గాల్లో తాను వేలు పెట్టి రాజకీయాలు చేయడం లేదని, తన ఆలోచన అంతా కర్నూలు జిల్లా అభివృద్ధి మీదే ఉందన్నారాయన. కావాలని నన్ను టార్గెట్ చేయొద్దు, నేను రాజకీయం చేయాలనుకుంటే మీకే ఇబ్బంది..అంటూ వార్నింగ్‌ ఇచ్చారు టీజీ భరత్‌. సీఎం చంద్రబాబు, లోకేష్‌కు తానేంటో తెలుసునని, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నంత వరకు తాను కేబినెట్‌లో ఉంటానని కూడా క్లియర్‌గా చెప్పారాయన. దీంతో… అసలు ఆయన్ని టార్గెట్ చేసిందెవరు, ఎవరికి ఆ రేంజ్‌ వార్నింగ్ ఇచ్చారంటూ చర్చలు నడుస్తున్నాయి. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌లోని 3 డివిజన్లు కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. అక్కడ టీడీపీ ఇన్చార్జ్‌గా జిల్లా కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి వున్నారు.

అలాగే… ఆయన అనుచరుడు బొగ్గుల దస్తగిరి కోడుమూరు ఎమ్మెల్యే. ఈ క్రమంలో…కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం వ్యవహారాల్లో విష్ణువర్ధన్ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారనేది టీజీ వర్గీయుల అభ్యంతరంగా తెలుస్తోంది. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మంత్రి అనుచరుడు నాగరాజు నియమితులయ్యారు. దీన్ని కూడా విష్ణువర్ధన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారట. ఆ రకంగా రెండు వర్గాల మధ్య విబేధాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. తాజాగా మరో మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి కోడుమూరు నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు టీజీ వెంకటేష్‌. అ సమయంలో కూడా మంత్రి అనుచరులు ప్రోగ్రామ్‌లో పాల్గొనకుండా అడ్డుకునే ప్రయత్నం జరిగిందట. ఇరువర్గాల మధ్య తోపులాట కూడా జరిగింది. అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్న సభలో డీసీసీబీ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి టీజీ భరత్‌ పేరు కూడా ఉచ్ఛరించకపోవడాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు తెలిసింది.

Also Read

  • Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
  • Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
  • Off The Record : ఎన్టీఆర్ జిల్లాలో బలమైన కాపు నేతల కోసం వైసీపీ వెదుకులాట
  • Off The Record : టేకాఫ్ ఉంటుందా? లేదా పర్మినెంట్ ల్యాండిగేనా?
Add as a preferred
source on google

ఈ విషయాన్ని కొందరు విష్ణువర్ధన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా… వేదిక మీదే…. మైక్ ఆన్‌లో వుండగానే ‘నోరు మూసుకో’ అనడం టీజీ వర్గీయుల చెవిన పడింది. ఈ పరిణామాలన్నిటినీ దృష్టిలో ఉంచుకునే.. ఆ మరుసటిరోజే భరత్‌ హాట్‌ కామెంట్స్‌ చేసినట్టు తెలుస్తోంది. అంత గట్టిగా మాట్లాడినా… ఎవర్ని ఉద్దేశించి అన్నారో అర్ధం అవుతున్నా, డైరెక్ట్‌గా లేకపోవడంతో… వ్యతిరేక వర్గం కౌంటర్ ఇవ్వలేకపోతున్నట్టు తెలిసింది. కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీని గెలిపించి 4 దశాబ్దాల చంద్రబాబు కలనేరవేర్చానంటూ విష్ణువర్ధన్ రెడ్డి బహిరంగసభలో చేసిన వ్యాఖ్యలపై కూడా మంత్రి భరత్ వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారట. చంద్రబాబు, టీడీపీ లేకుండా విష్ణువర్ధన్ రెడ్డి గెలిపించారా….అలాగైతే 2019లో కూడా గెలిపించాలి కదా అంటూ కౌంటర్ ఇస్తున్నారు. మొత్తమ్మీద మంత్రి టీజీ వార్నింగ్స్‌ దుమారం గట్టిగానే రేగుతోంది కర్నూల్‌ పాలిటిక్స్‌లో.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh TDP
  • Intra-party tension
  • Kodumur politics
  • off the record
  • TG Bharat warning

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions