అందరికీ సంక్రాంతి జనవరిలో వస్తుంది. ఆ ఊళ్లో మాత్రం ఇప్పుడే వచ్చింది. కొబ్బరి తోటల్లో బరులు కట్టించి.. జోరుగా పందాలు మొదలెట్టారు. ఊరి ప్రెసిడెంట్‌గారు దగ్గరుండి మరీ బెట్టింగులు పెట్టించారు. తోటల్లో మేళం సంగతిని లేటుగా తెలుసుకున్న పోలీసులు, రైడింగులు కూడా చేశారు. అసలు విషయం ఏంటంటే.. బరుల దగ్గర అరెస్టైన వాళ్లు.. స్టేషన్‌కు వచ్చే సరికి గాయబ్ అయ్యారు. ఎందుకిలా? అని ఆరాతీస్తే తెలిసింది. ప్రెసిడెంట్‌గారు అధికారపార్టీ ఎమ్మెల్యేకు రైట్ హ్యాండ్ అని. ఇంతకీ ఆ ఊరు ఎక్కడ? ఆ ప్రెసిడెంట్ ఎవరో మీరేచూడండి.
ఇదిగో.. ఫొటోలో తెల్లచొక్కా వేసుకుని కనిపిస్తున్న ఇతనే ప్రెసిడెంట్ యువరాజు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ఊర్లగూడెం సర్పంచ్. యువరాజుకు పక్కనే ఉన్న మరో వ్యక్తి కామిరెడ్డి నాని. దెందులూరు నియోజక వర్గం శ్రీరామాపురం సర్పంచి. ఈ ఇద్దరూ కలిసి యర్రంపల్లి కొబ్బరి తోటల్లో జోరుగా కోడిపందాలు నడిపిస్తున్నారు. ఈ ఫొటో కూడా ఆ పందాల్లో తీసిందే!
సంక్రాంతి అప్పుడే వచ్చిందా? అన్నట్టు యర్రంపల్లి తోటల్లో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. కోట్లల్లో బెట్టింగులు కాస్తూ ఎంజాయ్ చేస్తున్నారు పందెం రాయుళ్లు. పశ్చిమకు చెందిన వాళ్లే కాదు.. తెలంగాణ నుంచి వచ్చి మరీ ఇక్కడ పందాలు ఆడుతున్నారు. ఊర్లగూడెం సర్పంచు యువరాజు దగ్గరుండి మరీ ఫ్లడ్‌లైట్లు పెట్టించి ఈ పందాలు నడిపిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
చీకట్లో సీక్రెట్టుగా నడుస్తున్న పందాల గురించి లేటుగా తెలుసుకున్న పోలీసులు, జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవికిరణ్ ఆద్వర్యంలో దాడులు చేశారు. 32 మందిని అరెస్ట్ చేసి, 20 కార్లు, 40 బైకులు, 60 కోడిపుంజులతో పాటు, నాలుగు లక్షల నగదును సీజ్‌చేశారు. ఇదిగో పట్టుకున్నవాళ్లను ఇలా ప్రెస్‌మీట్‌లో చూపించారు.
అసలు మ్యాటరు ఏంటంటే! తోటల్లో అరెస్టైన వాళ్లు పోలీస్‌స్టేషన్‌కు వచ్చే సరికి గాయబ్ అయ్యారు. అసలు వ్యక్తులను పోలీసులు రాత్రికి రాత్రే అదృశ్యమయ్యారు. అంతేకాదు, ఇక్కడ పందాలు కట్టింది రెండు కోట్ల పైమాటే అని చెబుతున్నారు ప్రత్యక్ష సాక్షులు. ప్రెస్‌మీట్‌లో పోలీసులు చూపించింది మాత్రం కేవలం నాలుగు లక్షలే కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎందుకిలా? అని ఆరా తీస్తే. అంతా అధికారపార్టీ ఎఫెక్ట్ అంటున్నారు ఇక్కడి ప్రజలు.
ఊర్లగూడెం సర్పంచ్ యువరాజు చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా రైట్ హ్యాండ్. అతని పక్కనే కూర్చున్న శ్రీరామాపురం సర్పంచ్ కామిరెడ్డి నాని దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి రైట్ హ్యాండ్. ఒక్కచోట కలిసిన ఈ రెండు రైట్‌హ్యాండ్లు అధికారపార్టీ అండదండలతో ఇష్టమొచ్చిన ఆట ఆడుతున్నాయి. కోడిపందాల స్థావరంపై పోలీసులు దాడి చేసినప్పుడు అక్కడే ఉన్నఈ ఇద్దరు రైట్ హ్యాండ్లు.. మర్నాడు పోలీసులు ప్రెస్‌మీట్ పెట్టినప్పుడు కనిపించక పోవడంపై అనుమానాలు మొదలయ్యాయి.
పోలీసులు ఇప్పుడు రైడ్ చేసినా.. ఇక్కడ కోడిపందాలు జరగబట్టి చాలా రోజులవుతోంది. ఫ్లడ్‌లైట్లు పెట్టిమరీ పందాలు ఆడినా.. ఆ వెళుతురు పోలీసులను చేరడానికి చాలా సమయం పట్టింది. ఆళ్లూ ఈళ్లు వేలెల్తి చూపడంతో మొక్కుబడిగా రైడ్ చేసిన పోలీసులు, అధికాపార్టీకి చెందిన వ్యక్తులను తప్పించేరనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెడ్ హ్యాండెడ్‌గా దొరికి వ్యక్తులను కూడా వదిలేయడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. సామన్యులకు ఒక న్యాయం, రాజకీయ నాయకులకు మరోన్యాయమా? అంటున్న పబ్లిక్‌కు పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి సమాధానం చెబుతారో వేచిచూడాలి.
