Site icon NTV Telugu

Telangana BJP : బీజేపీ రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడమే టార్గెట్ గా పెట్టుకుందా..?

Bjp Target Telangana

Bjp Target Telangana

Telangana BJP :బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది.రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవటమే టార్గెట్‌గా పావులు కదుపుతోంది. ఇలాంటి తరుణంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది.ఇంతకీ..ఏంటా నిర్ణయం?రాష్ట్రంలో ఇంకా ఎలాంటి మార్పులు జరగబోతున్నాయ్?

జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగియగానే కమలం పార్టీ కేంద్ర నాయకత్వం సంస్థాగత మార్పులు చేపట్టింది. పలు రాష్ట్రాల సంస్థాగత ప్రధాన కార్యదర్శులను ఇప్పటికే మార్చింది. తెలంగాణ రాష్ట్ర సంఘటనా కార్యదర్శిని పంజాబ్‌కు పంపించింది. ఇంకా అయన స్థానంలో కొత్త వారిని నియమించలేదు.

తెలంగాణపై ఫోకస్ పెట్టిన బీజేపీ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని సంస్థాగత మార్పులు చేస్తూ వస్తోంది. రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శిని మార్చిన కేంద్రనాయకత్వం తాజాగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిని కూడా మార్చేసింది. తరుణ్‌చుగ్ స్థానంలో సునీల్ బన్సల్‌ను నియమించింది పార్టీ హై కమాండ్. సునీల్ బన్సల్ రాష్ట్ర ఇంఛార్జిగా వస్తుండటంతో పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. అయన గురించి పార్టీ కార్యకర్తలకు ఇప్పటికే తెలిసి ఉండటంతో పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుందోనని చర్చించుకుంటున్నారట.

ఐతే…సునీల్‌ బన్సల్‌ను రాష్ట్రానికి పంపించడం అంటే తెలంగాణలో జెండా పాతేందుకేననే ప్రచారం జరుగుతోంది. తమ తరువాతి టార్గెట్ పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఒడిశా అని చెబుతూ వస్తున్నారు బీజేపీ నేతలు. ఆ దిశగా అడుగులు వేస్తుందనడానికి సునీల్ బన్సల్ నియామకం ఒక ఉదాహరణ అని అనుకుంటున్నారట. తెలంగాణకు అయనను ఇంఛార్జిగా వేయడంతో శ్రేణుల్లో సంతోషం వ్యక్తం అవుతోందట.

నిజానికి…సునీల్‌ బన్సల్ అమిత్ షా కు అత్యంత సన్నిహితుడు. రాష్ట్ర వ్యవహారాలపై మరింత దృష్టి సారించేందుకు అమిత్ షా ఆయనను ఇక్కడకు పంపించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నేరుగా అమిత్ షా, సంతోష్‌లతోనే అయన టచ్‌లో ఉంటారని టాక్‌. అందుకే నిర్ణయాలు చకచకా తీసుకుంటారని సమాచారం. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలోనే అయన అందరినీ ఒక దగ్గరికి చేర్చి పార్టీని విజయ తీరాలకు నడిపించారట. తెలంగాణ ఆయనకు పెద్ద ఇష్యూ కాదని అనుకుంటున్నారు.

మరోవైపు…నేతలు ఇగోలకు పోవడం, ఎడమొహం పెడ మొహంగా ఉంటే వారికే నష్టం అని మాట్లాడుకుంటున్నారు. సంస్థాగత వ్యవహారాలలో, సామాజిక సమీకరణాలలో, ఎన్నికల స్ట్రాటజీలో బన్సల్‌కి అపార అనుభవం ఉందంటున్నారు స్థానికనేతలు. ఉత్తరప్రదేశ్‌లో బిజెపి విజయం వెనుక అయన కృషి ఎంతగానో ఉందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. కష్టపడే వారికి ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు.

 

Exit mobile version