కళ్యాణదుర్గం…ఈ నియోజకవర్గంలో ఏపీలో కొంత స్పెషల్ అని చెప్పాలి.అదేంటో కానీ, ఇక్కడ పోటీ చేసిన వారిని అడక్కుండానే మంత్రి పదవి వరిస్తూ ఉంటుంది.అందుకే ఈ నియోజకవర్గం లక్కీ అనుకునేలా మారిపోయింది.
ఇందుకు పర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్.. తాజాగా మంత్రి అయిన ఎమ్మెల్యే ఉషా శ్రీ చరణ్.ఆమె తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు.
గతంలో నియోజకవర్గంలో ఎప్పుడూ ఆమె పని చేసింది లేదు.కేవలం 2019ఎన్నికల ముందు నియోజకవర్గానికి వచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచారు.మరి అలాంటి ఉషాశ్రీ చరణ్ కు ఇప్పుడు జిల్లాలో ఎంతో మంది సీనియర్లు, బలమైన నేతలు ఉన్నా..వారిని కాదని, ఉషాశ్రీ చరణ్ కు మంత్రి పదవి ఇచ్చారు జగన్
గతంలో ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన ఇద్దరు ఏకంగా మూడుసార్లు మంత్రులుగా పనిచేశారు. బలమైన శాఖలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలైన లక్ష్మీదేవి కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసి పలుసార్లు గెలిచారు. 1973-77 లో ఒకసారి 1990-94లో మరొకసారి మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత మడకశిర ప్రాంతం నుంచి వచ్చిన రఘువీరారెడ్డి .. 2009 ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచే పోటీ చేసి గెలుపొందారు. అప్పుడు కూడా ఆయన ఐదేళ్ల పాటు మంత్రిగా కొనసాగారు. అందునా రెవెన్యూ వంటి కీలక శాఖలకు సారథ్యం వహించారు. ఇప్పుడు తాజాగా ఉషాశ్రీ చరణ్ మంత్రి కావడంతో కళ్యాణ దుర్గం మంత్రిపదవులకు దుర్గమని అంటున్నారు. దీనిపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నా.. పాత సెంటిమెంట్ ను గుర్తు చేసుకుంటున్నారు. ఇంతకీ ఇక్కడ పాత సెంటి మెంట్ ఏంటి….
సాధారణంగా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వారికి మంత్రి పదవి ఎలా ఈజీగా వస్తుందో.. అలానే వారి రాజకీయ జీవితం కూడా కనుమరుగవుతుంది. ఉదాహరణకు మాజీ మంత్రి లక్ష్మీదేవి చాలా సీనియర్ లీడర్. ఆమె రెండు సార్లు మంత్రిగా చేయడమే కాదు, సీడబ్ల్యూసీ మెంబర్ గాను, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, ఏఐసీసీలో మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా, ఏఐసీసీ సర్వింగ్ మెంబర్ గా, అలాగే ఏఐసీసీ డిసిప్లైనరీ కమిటీ ఛైర్ పర్సన్ గా కొనసాగారు. అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ఎవరూ చేయనన్ని పదవుల్లో ఆమె కనిపించారు. కానీ అంతటి చరిత్ర ఉన్న ఆమె ఒక్కసారిగా కనుమరగయ్యారు. కనీసం ఆమె కుటుంబం నుంచి వారసులుగా కూడా ఎవరూ రాజకీయాల్లో కనించలేదు. ఆ తరువాత రఘువీరారెడ్డి.. ఆయన కూడా రెండు సార్లు మంత్రిగా పనిచేశారు. ఏపీ పీసీసీ బాస్ అయ్యారు. కళ్యాణదుర్గం నుంచి గెలిచి మంత్రి అయిన తరువాత అనుకోని పరిస్థితుల్లో ఆయన కనుమరుగయ్యారు. 2019 వరకు పీసీసీ అధ్యక్షుడిగా ఒక వెలుగు వెలిగిన రఘువీరారెడ్డి ఇప్పుడు అజ్ఞాతంలో ఆధ్యాత్మిక చింతనలో ఉన్నారు. ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ రెండు పేర్లు సామాన్యమైనవి కావు. కాంగ్రెస్ పార్టీలో వారు చూడని పదవులు లేవు. అలాంటి వారు కనుమరుగు కావడం ఏంటో అర్థం కాని పరిస్థితి…
మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచిన ఉషాశ్రీ మంత్రి కావడం విశేషం. అయితే ఈ సెంటిమెంట్ ఈ ఎమ్మెల్యేకి వర్తిస్తుందా అంటే కాలమే చెప్పాలి. వాస్తవంగా జిల్లాలో యాక్టివ్ గా ఉన్న ఎమ్మెల్యేల్లో ఉషాశ్రీ చరణ్ కూడా ఒకరు. ఆమె పాత సెంటిమెంట్ ను ఓడించి, భవిష్యత్ లో కూడా సత్తా చాటుతారేమో చూడాలి…
Watch Here : https://youtu.be/atWzUeRo6dQ
