Site icon NTV Telugu

YCP : ఆ మాజీ మంత్రిని సొంత వాళ్ళే సైడ్ నుంచి కుమ్మెస్తున్నారా..?

Balineni Srinivas

Balineni Srinivas

విమర్శలు.. వివాదాలు..! ప్రస్తుతం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఇది. ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచినా.. గతంలో మంత్రిగా చేసినా.. ఆయన రాజకీయం వేరు. ఇప్పుడు రాజకీయంగా ఆయన ఎదుర్కొంటున్న పరిస్థితులు వేరు. అంతా రివర్స్‌. బయటకొచ్చి సొంతపార్టీ వారికే వార్నింగ్‌ ఇవ్వాల్సిన స్థితిలో బాలినేని ఉన్నారు. మూడేళ్లుగా ఒక వివాదం నుంచి బయటకు వచ్చే లోపు మరో వివాదం చుట్టుముడుతోంది. అప్పట్లో భూ దందాలలో ఆరోపణలు వచ్చాయి. వాటిల్లో అనుచరుల పాత్ర ఉండటంతో వారిని పిలిచి గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. చర్యలు తీసుకుంటామని హెచ్చరించారట. అయితే తాజాగా టీడీపీతోపాటు వైసీపీలోని కొందరు తనను టార్గెట్ చేశారని బాలినేని చెప్పడం కలకలం రేపింది. అయిన దానికి కానిదానికి తనపై విమర్శలు చేస్తున్న విపక్షాలకు సొంతపార్టీ వాళ్లు ఉప్పందిస్తున్నారని సందేహిస్తున్నారు బాలినేని. తప్పు చేసినట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్‌ విసిరారు కూడా. ఇది జరిగి పది రోజులు అయ్యిందో లేదో.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మాజీ మంత్రిని టార్గెట్‌ చేయడం చర్చగా మారింది.

వైసీపీకే చెందిన సోషల్‌ మీడియా ప్రతినిధుల్లో కొందరు బాలినేనిని లక్ష్యంగా చేసుకుని పోస్టింగ్‌లు వైరల్‌ చేస్తున్నారు. వాటిల్లో మాజీ మంత్రిపై తీవ్ర ఆరోపణలు ఉండటం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. వైసీపీకి 175 సీట్లు రావాలని కోరుకుంటుంటే.. బాలినేని వంటి నేతలు వైసీపీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని కామెంట్స్‌ చేస్తుండటం మాజీ మంత్రి శిబిరాన్ని కలవర పెడుతోందట. బాలినేని ముఖ్య అనుచరుడిగా ఉన్న ఒంగోలు డిప్యూటీ మేయర్‌ వెలనాటి మాధవరావు భూ దందాలను ప్రత్యేక ప్రస్తావించడం రచ్చ రచ్చ అవుతోందట.

గతంలో వైసీపీని టీడీపీ నేతలే ఏదైనా అంటే వెంటనే సోషల్‌ మీడియాలో ఏకిపారేసే అధికారపార్టీ సానుభూతి పరులు.. ప్రస్తుతం బాలినేని లక్ష్యంగా చేసుకోవడమే ప్రశ్నగా మారింది. ఆ పోస్టింగ్‌లు టీడీపీ వాళ్లకు అస్త్రాలుగా మారిపోయాయి. దీంతో అటు సొంత పార్టీ నేతలు.. ఇటు టీడీపీ నుంచి మాజీ మంత్రిని కార్నర్‌ చేసే సంఘటనలు ఎక్కువయ్యాయి. అయితే ఒంగోలులోని గద్దలగుంట ప్రాంతానికి చెందిన ఒక భూమి విషయంలో వచ్చిన ఆరోపణలపై డిప్యూటీ మేయర్‌ మాధవరావు మీద బాలినేని సీరియస్‌ అయినట్టు తెలుస్తోంది. దాంతో మాధవరావు తన పదవికి రాజీనామా చేయనున్నారని ప్రచారం జోరందుకుంది. ఇదే సమయంలో మరో చర్చా నడుస్తోంది. సోషల్ మీడియాలో బాలినేనిని గురిపెట్టిన సొంతపార్టీ వాళ్లకు మాధవరావు సమాధానం ఇస్తారని.. గద్దలగుంట భూ వివాదంపై వివరణ ఇస్తారని అనుకుంటున్నారట.

ఈ ఎపిసోడ్‌లో ఏదే అనుకుంటే ఇంకేదో జరుగుతుండటంతో .. కొందరు వైసీపీ నేతలు సైతం సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై కన్నెర్ర చేస్తున్నట్టు తెలుస్తోంది. వ్యక్తిగత అంశాలను దృష్టిలో పెట్టుకుని లేని పోని ఆరోపణలు చేస్తున్నారని.. బాలినేని ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారట. వైసీపీకి ఎంత సానుభూతి పరులైనా.. ఆధారాలు లేకుండా నిందలు వేస్తే చూస్తూ ఊరుకునేది లేదని కొందరు హెచ్చిరస్తున్నట్టు సమాచారం. అయితే సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెడుతున్నవారికి వైసీపీలోనే కొందరు రాంగ్‌ ఫీడ్‌ బ్యాక్‌ ఇస్తున్నట్టు సందేహిస్తున్నారట. ఇప్పటికే ఒకసారి మీడియా ముందుకు వచ్చి వార్నింగ్‌ ఇచ్చిన బాలినేని.. తాజా రగడపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. యాక్షన్‌లోకి దిగుతారో లేదో అని అభిమానులూ ఎదురు చూస్తున్నారట. మొత్తానికి ఒంగోలు వైసీపీ రాజకీయంలో కారాలు.. మిరియాల

Exit mobile version