తెలంగాణ కాంగ్రెస్ రైతు డిక్లరేషన్‌ను సీరియస్‌గా తీసుకుంది. వచ్చే నెల రోజుల కార్యాచరణ ప్రకటించింది కూడా. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామాన్ని టచ్ చేయాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. రాహుల్ గాంధీ చెప్పిన షెడ్యూల్ ప్రకారం ప్రొగ్రామ్ ప్లాన్ చేస్తున్నారు. దీనికోసమే ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశాన్ని చాలామంది సీనియర్ నేతలు డుమ్మా కొట్టారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. ఇద్దరు ఎంపీలు.. ఎమ్మెల్యేలు రాలేదు. కొందరు ఉదయపూర్ చింతన్ శిబిర్‌కి వెళ్లడంతో రాలేదని చెబుతున్నా.. అందుబాటులో ఉన్న నాయకులు కూడా మీటింగ్‌కు వెళ్లకుండా హ్యాండిచ్చేశారు. రాహుల్ గాంధీ ప్రసంగంపై కాంగ్రెస్‌లో కొందరు నాయకులు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేశారని జగ్గారెడ్డితోపాటు మరికొందరు అలక వహించారట. దీంతో సమీక్షకే వెళ్లని నాయకులు రేపటి రోజున ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తారా అనే అనుమానాలు ఉన్నాయట.
ఈ నెల 21 నుంచి జనంలోకి వెళ్లేందుకు రైతు డిక్లరేషన్ పై యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. గ్రామాలకు వెళ్లి కాంగ్రెస్ ఏం చేస్తుంది… ఏం చేసింది అనే అంశాలపై రచ్చబండ దగ్గర చర్చ చేస్తారు. పీసీసీ షెడ్యూల్ కంటే ముందే జగ్గారెడ్డి తన నియోజకవర్గంలో టూర్ షెడ్యూల్ ప్రకటన చేశారు. పార్టీ డిక్లరేషన్‌ని సీరియస్‌గా తీసుకోకుంటే.. జిల్లాల వారీగా ఉండే పంచాయితీలు కూడా రచ్చబండకు అడ్డంకి అవుతాయనే చర్చ జరుగుతోంది. రాహుల్ పర్యటన తర్వాత కొంతమంది నాయకులు బయటకు మాట్లాడలేక.. ఇబ్బంది పడుతున్న వాళ్లు కూడా ఉన్నారు. వీళ్లంతా ఏం చేస్తారన్నది చర్చ. కొందరు డీసీసీ అధ్యక్షులు ఇప్పటికే పీసీసీపై అసంతృప్తితో ఉన్నారు. వీటన్నింటినీ ఎలా సమన్వయం చేస్తారు? నాయకులను ఒకచోటకు తీసుకొచ్చేది ఎవరు అనేది పెద్ద ప్రశ్నగా ఉంది.
వాస్తవానికి తెలంగాణలో రాహుల్ పర్యటన తర్వాత కాంగ్రెస్ నాయకులు విభేదాలను పక్కనపెట్టి ఐక్యతగా వెళ్తారని అనుకున్నారు. కానీ.. నేతల మధ్య గ్యాప్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అందుకే రచ్చబండపై ఎవరూ ధైర్యంగా మాట్లాడలేని పరిస్థితి ఉంది. రైతు డిక్లరేషన్ సాఫీగా సాగితే ఎలాంటి గొడవ ఉండదు. కానీ.. రచ్చబండ రచ్చ రచ్చ అయితే మాత్రం మొదటికే మోసం వస్తుందని గాంధీభవన్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయట. మరి..