Site icon NTV Telugu

Off The Record: జూబ్లీహిల్స్ విజయంతో కాంగ్రెస్ లో జోష్ .. మరో రెండు చోట్ల ఉప ఎన్నికలకు సిద్ధం?

Danam

Danam

Off The Record: జూబ్లీ కిక్కుతో కాంగ్రెస్‌లో కొత్త ఊపు వచ్చిందా? మరో రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు సిద్ధమవుతోందా? ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా మేం రెడీ అంటూ సంకేతాలిచ్చేశారా? ఇక పార్టీ నిర్ణయమే తరువాయా? ఏయే శాసనసభ్యులు బైపోల్‌కు సిద్ధమవుతున్నారు? ఎందుకలా?

Read Also: Off The Record: కేసీఆర్ విషయంలో రేవంత్ రివర్స్ వ్యూహం అమలు ?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు కాంగ్రెస్ నాయకత్వంతో పాటు…సీఎం రేవంత్‌రెడ్డిలో కూడా జోష్ పెంచాయి. ఇక కాంగ్రెస్‌ కేడర్‌లో కాన్ఫిడెన్స్ లెవల్ గురించి అయితే.. చెప్పేపనేలేదు. ఇదే ఊపులో ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బైపోల్‌ అంశం చర్చకు వస్తోంది. ఎమ్మెల్యేల మీద దాఖలైన అనర్హత పిటిషన్స్‌ విచారణ క్రమంగా కొలిక్కి వస్తోంది. ఇప్పటి వరకు నలుగురు శాసనసభ్యుల విచారణ ముగిసింది. మరో నలుగురి విచారణ కొనసాగుతోంది. ఐతే.. ఖైరతాబాద్ MLA దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యుడు కడియం శ్రీహరి మాత్రం స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. వీళ్ళిద్దరిదీ మిగతా వాళ్ళకంటే భిన్నమైన కేస్‌ అన్న అభిప్రాయం ఉంది. అందుకే… విచారణ నోటీసులు ఎదుర్కోవడం.. అనర్హత లొల్లి కంటే రాజీనామా చేసి ఉప ఎన్నికల్ని ఎదుర్కోవడమే బెటరన్న ఆలోచనలో ఇద్దరూ ఉన్నట్టు సమాచారం.

Read Also: IBomma Ravi: ఐ-బొమ్మ నిర్వాహకుడికి 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలింపు..

అందుకే… వీలైనంత త్వరగా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. బీఆర్‌ బీ ఫామ్‌ మీద గెలిచిన కడియం శ్రీహరి… గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తన కుమార్తె కోసం విస్తృత ప్రచారం చేశారు. కాంగ్రెస్‌కు ఓటేయండని అభ్యర్థించారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఇది చాలా కీలకమైన అంశం. ఒక పార్టీ తరపున గెలిచి మరో పార్టీ అభ్యర్థికి ఓటేయమని బహిరంగంగా ప్రచారం చేసినందున కడియం శ్రీహరిపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక కడియం కంటే సీరియస్‌ కేసు మరో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచి… ఆ పదవికి రాజీనామా చేయకుండానే… లోక్‌సభ ఎలక్షన్స్‌లో స్వయంగా కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారాయన.

Read Also: CSK New Captain 2026: 2026 ఐపీఎల్‌కు కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన సీఎస్‌కే యాజమాన్యం..

అధికారికంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అయిఉండి… కాంగ్రెస్ అభ్యర్ధిగా పార్లమెంట్‌కు ఎలా పోటీ చేశారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆ కారణంతో… ఖైరతాబాద్ ఎమ్మెల్యే మీద కూడా అనర్హత వేటుకు అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అందుకే ఆయనతో పాటు పార్టీ నాయకత్వం కూడా వేటు కంటే ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బైపోల్‌కు పోవడం పోవడం బెటర్ అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో కడియం శ్రీహరి… దానం నాగేందర్ ఇద్దరూ బలమైన నాయకులే. గెలిచి వస్తామన్న ధీమాతో ఉన్నారు కాబట్టి..త్వరలో రాజీనామాలు ఉంటాయని, ఈ రెండు సెగ్మెంట్స్‌లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. జూబ్లీహిల్స్‌లో గెలిచిన తీరు, అనుసరించిన వ్యూహాల్ని అక్కడ కూడా అమలు చేస్తే… అంతకంటే తేలిగ్గా గెలవగలుగుతామన్న చర్చ నడుస్తోంది కాంగ్రెస్‌ వర్గాల్లో.

Exit mobile version