YCP : ఆ ఎమ్మెల్యే సెల్ఫ్ గోల్ చేసుకున్నారా.? సీన్ లోకి ఎందుకు ఎంట్రీ అయ్యారు.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిఫెన్స్ పడ్డ ఆ ఎమ్మెల్యే.. సెల్ఫ్‌గోల్ చేసుకున్నారా? ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత సీన్లోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చారు? గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు అప్రమత్తంగా వ్యహరించారా? రోజంతా హైడ్రామా నడిచిన వ్యవహారంలో కొండను తవ్వి ఎలుకను పట్టుకుంది ఎవరు?
పోలీస్ స్టేషన్లో నేలపై పరుపు వేసుకుని నిద్ర పోతున్నది ఎవరో కాదు.. కోనసీమ జిల్లాలోని కొత్తపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి. ఈ సీన్‌కు వేదిక రావులపాలెం పోలీస్ స్టేషన్. రెండు రోజులు ఇక్కడ నాటకీయ పరిణామాలు రాజకీయ చర్చకు దారితీశాయి. ఖాకీలపై ఖద్దరు పైచెయ్యి సాధిస్తుందా? లేక ఖద్దరుపై ఖాకీ మాటే నెగ్గుతుందా అనే అంతా ఆరా తీశారు.
Also Read
రావులపాలెం మండలం గోపాలపురంలో అంబేద్కర్ ఫొటోలతో టిఫిన్ ప్లేటుల్లో ఆహార పదార్థాలు ఇవ్వడంతో ఈ నెల 5న గొడవ జరిగింది. ఆ కేసులో 18 మందిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపారు పోలీసులు. రెండు నెలల క్రితం అమలాపురంలో జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకుని.. గోపాలపురం ఘటనలో ఖాకీలు చాలా వేగంగా స్పందించారు. శాంతి భద్రతల సమస్య రాకుండా జాగ్రత్త పడ్డారు. ఈ ఘటనపై రాజకీయ పార్టీలు చేయాల్సిందంతా చేశాయి. రెండు వైపులా వ్యవహారాన్ని చక్కబెట్టినట్టు హల్చల్ చేశాయి. అయితే ఈ ఎపిసోడ్లో వైసీపీ వెనకపడిందని అనుకున్నారో ఏమో.. ఐదు రోజుల తర్వాత ఎంట్రీ ఇచ్చారు ఎమ్మెల్యే జగ్గిరెడ్డి .
వైసీపీ ప్లీనరీలో బిజీగా ఉండటంతో నియోజకవర్గంలో ఏం జరుగుతుందో పట్టించుకోలేదని కేడర్ క్వశ్చన్ చేయకుండా.. జగ్గిరెడ్డే అడ్వాన్స్ అయిపోయారని టాక్. సమస్యను ప్రతిపక్షాలు బాగానే టేకాఫ్ చేశాయని.. ఆ సీన్లో మనం ఎక్కడా లేమని కొందరు చెప్పడంతో ఎమ్మెల్యే కొత్తగా ఆలోచించారట. ఈ ఘటనలో సీఐ, ఎస్ఐల పాత్రను తప్పుపడుతూ.. వారిని సస్పెండ్ చేయాలని సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చుట్టూ ఉన్నవాళ్లు చెప్పారట. అదేదో బాగుందని అనుకున్నారో ఏమో.. అప్పటికప్పుడు రావులపాలెం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. సీఐ, ఎస్ఐలను సస్పెండ్ చేస్తేగానీ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లేది లేదని రాత్రి అక్కడే పడుకున్నారు.
ఎమ్మెల్యేకి మద్దతుగా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు రావడం.. డీఎస్పీ ఎమ్మెల్యేతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమస్య తీవ్రత పెరిగింది. జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్‌రెడ్డి మాత్రం.. ఆ ఘటనలో పోలీసుల తప్పు లేదని.. సీఐ, ఎస్ఐలను సస్పెండ్ చేసేది లేదని తేల్చి చెప్పేశారట. పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఎమ్మెల్యేతో మాట్లాడే ఉద్దేశం కూడా లేదని ఎస్పీ స్పష్టం చేశారట. మీ పొలిటికల్ ఇమేజ్ కోసం మమ్మల్ని బలిచేయొద్దని గట్టిగానే చెప్పారట ఎస్పీ. దాంతో జగ్గిరెడ్డి కొంత ఇబ్బంది పడినా.. మధ్యలో పోరాటాన్ని వదిలేస్తే ఇరకాటంలో పడతామని అనుకున్నారో ఏమో.. పోలీసుల తీరు వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందనే అంశాన్ని చర్చకు పెట్టారు. పైగా గొడవ జరిగింది జగ్గిరెడ్డి సొంతూరులోనే కావడంతో వెనక్కి తగ్గలేదు.
చివరకు ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు రావులపాలెం వచ్చారు. ఎస్పీ మాత్రం రాబోనని చెప్పేశారట. పలు దఫాల చర్చల తర్వాత సీఐ, ఎస్ఐలను ఈ కేసులో జోక్యం చేసుకోకుండా చూస్తామని.. అడిషనల్ ఎస్పీతో విచారణ చేయిస్తామని డీఐజీ హామీ ఇచ్చారు. దాంతో జగ్గిరెడ్డి మెత్తబడ్డారట. సీఐ, ఎస్ఐలను సస్పెండ్ చేయాలనే డిమాండ్ నెరవేరకపోయినా.. కింద పడ్డా తనదే పైచెయ్యి అన్నట్టుగా సర్దుకుపోయారట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. తెగేవరకు లాగకుండా మధ్యలోనే సమస్యకు ఎండ్ కార్డు వేయడంతో ఎమ్మెల్యే సెల్ఫ్‌గోల్ వేసుకున్నారనే చర్చ ఊపందుకుంది.
తాజావార్తలు
-
Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్‌తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
-
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
-
Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
ట్రెండింగ్
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!