Off The Record: స్వయంగా పార్టీ అధ్యక్షుడు జగన్ చెప్పినా.. ఆ ఇద్దరు నేతలు కలిసి పని చేయడానికి ఇష్టుడటం లేదా? ఆయన ముందు తలూపేసి వచ్చి నియోజకవర్గంలో చేయాల్సిన పనులు చేసేస్తున్నారా? మాజీ ఎమ్మెల్యే… ప్రస్తుతం ఇన్ఛార్జ్‌గా ఉన్న మాజీ ఎంపీకి ఎర్త్ పెడుతున్నారా? పార్టీ కేడర్ కూడా ఆమెకు సహకరించవద్దని పరోక్షంగా పిలుపునిచ్చారా? ఎవరా ఇద్దరు? ఏంటా మంటపెట్టుడు ప్రోగ్రామ్?
Read Also: Ozempic: డయాబెటిస్ రోగులకు తీపి కబురు.. భారత్ లో ఓజెంపిక్ ఔషధం వాడకానికి ఆమోదం..
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్, మాజీ ఎంపీ బుట్టా రేణుక పదవికి మళ్లీ ఎర్త్ పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. లోకల్‌గా బుట్టా, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి వర్గాల మధ్య గొడవలు పీక్స్‌కి చేరాయట. వైసీపీ అధిష్టానం ఇద్దరినీ పిలిచి సర్దుబాటు చేసినా… ఒక్క రోజులోనే మళ్లీ సేమ్ సీన్ అట. ఇదే ఊపులో.. చెన్నకేశవ రెడ్డి తాజాగా చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. స్థానికులు, వలస నేతలు అంటూ.. మాజీ ఎమ్మెల్యే అన్న మాటలు పార్టీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుకను ఉద్దేశించేనన్న చర్చ వైసీపీలో జరుగుతోంది.
Read Also: London: లండన్‌లో మహాత్మా గాంధీకి అవమానం.. స్పందించిన భారత్
అయితే, ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకుడు కూడా వలస నేతేనని, చెన్న కేశవ రెడ్డి అన్నది ఆయన్ని ఉద్దేశించేనని కొందరు వివరణలు ఇస్తున్నా.. ఇద్దరి మధ్య ప్రస్తుతం ఉన్న గ్యాప్ దృష్ట్యా.. ఎక్కువ మంది చూపులు బుట్టూ వైపే మళ్ళుతున్నాయి. చెన్నకేశవ రెడ్డి ఒక ప్రైవేటు కార్యక్రమంలో ఈ వలస కామెంట్స్ చేశారు. తాను ఇక్కడి భూమి పుత్రుడినని, ఇక్కడి ప్రజలతో తనకు సంబంధాలు ఉన్నాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమకే అవకాశం ఇస్తానని జగన్ హామీ ఇచ్చారని కూడా చెప్పారట చెన్నకేశవ. వలస నేతలు రాజకీయంగా బతకడానికి, ధన సంపాదన కోసం, స్వలాభం కోసం ఎమ్మిగనూరుకు వస్తున్నారని, వాళ్ళు ప్రజలకు ఎలాంటి సహాయం చేయరని అనడం పొలిటికల్ సెగలు పుట్టిస్తోంది. మెహర్భాని మాటలు చెప్పి మోసం చేస్తారని, వలస నాయకుల్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారట కేశవరెడ్డి. ఈ మాటలన్నీ.. బుట్టా రేణుక ను టార్గెట్ చేసినట్టుగానే ఉన్నాయని కొందరంటే.. కాదు కాదు.. టీడీపీ కీలక నేతను ఉద్దేశించినవని వాదిస్తున్నారు మరి కొందరు.
Read Also: Visakhapatnam: అసలే వివాహేతర బంధం.. అందులోనూ మళ్లీ పోటీ.. కత్తిపోట్లతో దద్దరిల్లిన విశాఖ..
ఇద్దరిన్నీ టార్గెట్ చేసి కూడా అలా అని ఉండవచ్చన్నది ఇంకో వెర్షన్. అయితే, జగన్ తమకే అవకాశం ఇస్తారన్న ప్రస్తావన వచ్చింది కాబట్టి.. కచ్చితంగా బుట్టా రేణుకే టార్గెట్ అయి ఉంటుందన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఎన్నికల ముందు నుంచే ఎమ్మిగనూరు వైసీపీలో బుట్టా రేణుక, చెన్న కేశవ రెడ్డి మధ్య వార్ నడుస్తోంది. రేణుక ఇక్కడ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం చెన్న కేశవరెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదట. 2024 ఎన్నికల్లో వైసీపీ టికెట్ తన కుమారుడు జగన్ మోహన్ రెడ్డికి దక్కకుండా రేణుక పోటీ పడ్డారన్న కోపం మాజీ ఎమ్మెల్యేకి గట్టిగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.
Read Also: Off The Record: తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయా? ఆగుతాయా?
వైసీపీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ బుట్టాకు ఇవ్వడం, చెన్న కేశవరెడ్డి వర్గం సహాయ నిరాకరణ ఇక్కడ బహిరంగ రహస్యం. కారణం ఏదైనా ఎమ్మిగనూరు బరిలో ఓడిపోయారు బుట్టా. చివరికి నియోజకవర్గ ఇన్చార్జిగా కూడా ఆమె ఉండకూడదని, తన కుమారుడు జగన్ మోహన్ రెడ్డిని నియమించాలంటూ చెన్న కేశవరెడ్డి చేయని ప్రయత్నమే లేదట. ఈ పరిస్థితుల్లో… విభేదాలను పరిష్కరించేందుకు వైసీపీ అధిష్టానం దశల వారీగా అనేక ప్రయత్నాలు చేసినా నో యూజ్. చివరికి ఇటీవల నియోజకవర్గ సమీక్షలో భాగంగా బుట్టా రేణుక, చెన్న కేశవ రెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డిని కూర్చోబెట్టి మాట్లాడారట పార్టీ అధ్యక్షుడు జగన్. ఇద్దరూ కలిసి కార్యక్రమాలు చేయాలని గట్టిగా చెప్పారట. ఆ తరువాత డిజిటల్ బుక్ ఆవిష్కరణ మాత్రం కలసి నిర్వహించారు.
Read Also: Off The Record: మంత్రి రాజనర్సింహ కుమార్తె పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా?
కానీ, అదే రోజు రాత్రి ఓ ప్రైవేటు కార్యక్రమంలో చెన్నకేశవరెడ్డి తన వ్యాఖ్యలతో పరిస్థితి ఏమాత్రం మారలేదనే సంకేతాలు ఇచ్చారన్న చర్చ వైసీపీలో జరుగుతోంది. చెన్నకేశవ రెడ్డి మాటలకు రెండు అర్థాలు తీస్తున్నాయట వైసీపీ శ్రేణులు. వలస నేతలు అన్నవి బుట్టా రేణుక టార్గెట్ గా చేసినట్టుగా చేసిన వ్యాఖ్యలని, ఆమెకు సహాయ నిరాకరణ చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినట్టుగా ఉందని చర్చించుకుంటున్నారు. మరోవైపు జగన్ తమకే హామీ ఇచ్చారని చెప్పడం ద్వారా ఈసారి టికెట్ బుట్టా రేణుక కు కాదని క్లారిటీ ఇచ్చేసినట్టేనంటున్నారు. చెన్న కేశవరెడ్డి వ్యాఖ్యలతో నియోజకవర్గ కేడర్‌లో మరింత గందరగోళం ఏర్పడుతోంది. మొత్తమ్మీద బుట్టా రేణుకకు ఎసరు పెట్టేస్తారా అన్న చర్చ మాత్రం ఎమ్మిగనూరులో హాట్ హాట్‌గా నడుస్తోంది.
