Bandi Sanjay : కొందరిపై వేటు తప్పదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీలో త్వరలో కొందరిపై వేటు పడబోతుందా? తూతూ మంత్రంగా పనిచేస్తున్న వారికి షాక్ తప్పదా? బండి సంజయ్ ఎవరిపై కన్నెర్ర చేశారు? ఆయన హెచ్చరికలు వర్కవుట్ అవుతున్నాయా.. లేదా?
జిల్లా అధ్యక్షుల పనితీరుపై పెదవి విరుపు
తెలంగాణలో ప్రత్యమ్నాయశక్తిగా పొలిటికల్ తెరపైకి రావాలని చూస్తోన్న బీజేపీ.. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. పోలింగ్ బూత్ నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీల పనితీరును సమీక్షిస్తోందట. అనుబంధ సంఘాలు.. పార్టీ కార్యక్రమాలు.. జిల్లాల్లో సొంతంగా చేపట్టిన పొలిటికల్ ప్రోగ్రామ్స్‌పై ఆరా తీస్తున్నట్టు సమాచారం. రాష్ట్రస్థాయిలో ఒకటి రెండు మోర్చాల పని తీరుపై అసంతృప్తి వ్యక్తమైందట. పలువురు జిల్లా అధ్యక్షుల పెర్ఫార్మెన్స్పై పెదవి విరిచినట్టు తెలుస్తోంది. పార్టీ కమిటీలు కూడా పూర్తిగా వేయలేదట. స్థానిక అంశాలనూ పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.
Also Read
ఉత్సవ విగ్రహాలుగా పార్టీ నేతలు
చాలా జిల్లాలో పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు తప్ప స్థానిక అంశాలపై ఆందోళనలు చేయడం లేదట. కొన్ని ప్రోగ్రామ్స్‌ను టిక్ మార్క్ వేయించుకోవడం కోసమే చేస్తున్నారట. పార్టీ బలోపేతానికి ఎలాంటి చొరవ చూపెట్టడం లేదని గుర్తించారు నాయకులు. తెలంగాణలో కిందిస్థాయిలో జరిగే కార్యక్రమాలు, కమిటీల వివరాలు ఎప్పటికప్పుడు సెంట్రల్ పార్టీకి రిపోర్ట్ చేయాలి. పెద్ద ఘటనలు జరిగినా వెంటనే స్పందించడం లేదట కొందరు లీడర్స్. చాలామంది జిల్లా అధ్యక్షుడు ఉత్సవ విగ్రహాలుగా కాలక్షేపం చేస్తున్నట్టు సమాచారం.
కొందరు జిల్లా అధ్యక్షులకు సంజయ్ వార్నింగ్
ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. పార్టీ జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంఛార్జ్‌లతో వేర్వేరుగా సమావేశం అయ్యారు. భవిష్యత్‌లో చేపట్టే కార్యక్రమాలపై చర్చించారు. ఆ సందర్భంగా కొందరు జిల్లా అధ్యక్షులను సంజయ్ హెచ్చరించారట. ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడానికి జిల్లా అధ్యక్షుల కృషి ఎంతో ఉందని.. వారికి ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇచ్చిందని సంజయ్ చెప్పారట. తెలంగాణలో కూడా పార్టీ కోసం కష్టపడితేనే గుర్తింపు ఉంటుందని ఆయన స్పష్టంచేశారట.
పది మంది బీజేపీ జిల్లా అధ్యక్షులపై వేటు?
ఇప్పటి వరకు జరిగిన సమీక్షలు.. అందిన నివేదికల ప్రకారం కొందరు బీజేపీ జిల్లా అధ్యక్షులను తప్పించే అవకాశం ఉందట. దాదాపు పది మందిపై వేటు పడొచ్చని అనుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం తమిళనాడులోనూ కొన్ని జిల్లాల అధ్యక్షులపై ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ కఠిన చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణలోనూ అదే జరుగుతుందని బీజేపీలో చర్చ జరుగుతోందట.
తాజావార్తలు
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!