OTR: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో పాత కొత్త వివాదం
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో పాత కొత్త వివాదం
- ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు
- ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి డామినేట్ చేస్తున్నారన్న టాక్
- సుదర్శన్‌రెడ్డి తన సామాజికవర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు
- ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఒకే సామాజికవర్గాన్ని ప్రోత్సహిస్తున్నారా?
- ఇద్దరి మధ్య పోరు వల్లే రెండు మున్సిపాలిటీల్ని కోల్పోవాల్సి వచ్చిందా?
- నాయకులు ఏ పని కావాలన్నా సలహాదారును కలవాలన్న ఆదేశాలున్నాయా?
- ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి బలవంతంగా భరిస్తున్నారా?
- జూపల్లి కృష్ణారావు టైం కోసం వేచి చూస్తున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాత, కొత్త గ్రూప్ వార్ కాంగ్రెస్ పార్టీకి గుదిబండగా మారిపోతోంది. ఏళ్లుగా జెండా మోసిన వారిని కాదని… జంపింగ్ జపాంగ్స్‌కు పదవులు కట్టబెడుతున్నారంటూ రగడ మొదలైంది. పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టుల్లో సింహభాగం కొత్త నేతల అనుచరులే ఎగరేసుకుని పోతున్నారంటూ అంతర్గత పోరు జరుగుతోంది. ఏకంగా పీసీసీ చీఫ్ ఇటీవల నిర్వహించిన సమావేశాల్లో సైతం కొంతమంది నేతలు అసహనం వెళ్ళగక్కారట. ఆసిఫాబాద్‌లో ఓనేత వర్గం నారాజ్‌లో ఉండగా మంచిర్యాలజిల్లాలో సైతం ఓ ఎమ్మెల్యే తన అసహనం వెళ్ళగక్కారు. నిర్మల్ జిల్లాలో సైతం ఇంకో నేత పార్టీలు మారి వచ్చిన వారికి పెత్తనం ఇవ్వడంపై గుర్రుగా ఉన్నారట.
Also Read
మరోవైపు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు జూపల్లి కృష్ణారావు. అయితే కొంతకాలంగా ఆయన్ని కాదని… అన్ని వ్యవహారాల్లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి వేలు పెడుతున్నారని, దాంతో… ఇన్ఛార్జ్ మినిస్టర్ ప్రాధాన్యం తగ్గిపోతోందన్న అభిప్రాయం బలపడుతోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ వ్యవహారాలన్నీ నిజామాబాద్ జిల్లా కేంద్రంగానే సాగడం ఇన్ఛార్జ్ మంత్రికి మింగుడు పడ్డం లేదట. అలాంటప్పుడు ఆయనకు ఆ బాధ్యతలు ఎందుకు ఇచ్చినట్టన్న ప్రశ్నలు వస్తున్నాయి. సలహాదారు.. తన సామాజికవర్గానికి చెందిన నాయకులు కొందరు ఇచ్చిన ప్రతిపాదనల్ని అమలు చేస్తూ.. పార్టీ సీనియర్స్‌కు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఫైనల్‌గా.. సలహాదారు చెప్పిన వారికే టికెట్లు రావడం, రెడ్డి సామాజికవర్గం నాయకుల ప్రతిపాదనలు మాత్రమే ఓకే కావడంతో మిగతా వాళ్లు నొచ్చుకున్నారట. పైగా కొన్ని చోట్ల పార్టీ సీనియర్లు పట్టుబడితే టికెట్లు ఇచ్చినా.. ఆదిలాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ తన అనుచరులను గెలిపించుకోవడం కోసం పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణం అయ్యారనే టాక్ కాంగ్రెస్‌లో ఉంది.
ఆదిలాబాద్‌లో ఒకరు, నిర్మల్‌లో మరొకరు తన సామాజికవర్గానికి చెందిన నాయకుల్నే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలున్నాయి. అలాగే.. జిల్లా స్థాయిలో నామినెటెడ్ పోస్టులు సైతం అగ్రవర్ణాలకే తప్ప బడుగు బలహీన వర్గాలకు, అందులో పార్టీ సీనియర్లకు అస్సలు ఇవ్వడం లేదని జిల్లా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఇక ఇన్ఛార్జ్ మంత్రి, సలహాదారు మధ్య అంతర్గతంగా ఉన్న విభేదాల వల్లే క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠాలు కోల్పోవాల్సి వచ్చిందనే వారు సైతం ఉన్నారు పార్టీలో. కట్టర్ కాంగ్రెస్ వాదులను విస్మరించడం సైతం అదే కోవలోకి వస్తుందంటున్నారు.
జిల్లాలోని నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ల నుంచి సీనియర్స్ లేదా ఉన్నత పదవుల్లో ఉన్న వారంతా తాము తమ వర్గాల కోసం పనిచేస్తున్నారే తప్ప.. పార్టీ కోసం, పార్టీ జెండా పట్టుకుని కేసుల పాలైన వారిని పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి పెరుగుతోంది. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఏపని కావాలన్నా సలహాదారునే కలవాలన్న ఆదేశాలు సైతం ఇన్ఛార్జ్ మంత్రిని అసహనానికి గురి చేస్తున్నాయట. జూపల్లి కూడా మరో మార్గం లేక బాధను దిగమింగుకుంటున్నట్టు చెబుతోంది ఆయన వర్గం. యూనివర్శిటీ కావాలాన్నా… ఎయిర్ పోర్టు , పారిశ్రామిక కారిడార్ భూసేకరణ… ఇలా విషయం ఏదైనాసరే… అధికారులు, నియోజకవర్గ నాయకులు ఇన్ఛార్జ్ మంత్రిని కాకుండా సలహాదారుడినే కలవాలంటూ పై నుంచి ఆదేశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీటన్నిటినీ మౌనంగా గమనిస్తున్న జూపల్లి కృష్ణారావు సమయం కోసం వేచిచూస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇలాంటి వాతావరణంలో సుదర్శన్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు మధ్య గ్యాప్ అంతకంతకూ పెరుగుతోందని, పార్టీ పెద్దలు జోక్యం చేసుకోకుంటే కష్టమన్న అభిప్రాయం బలపడుతోంది కాంగ్రెస్ వర్గాల్లో.
READ ALSO: Varanasi: వారణాసి కథ ఇదేనా? గూస్‌బంప్స్ గ్యారెంటీ..
తాజావార్తలు
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?