Site icon NTV Telugu

HIT 3 : విశ్వక్ మిస్సయింది అందుకే?

Vishwak

Vishwak

నాని హీరోగా నటించిన హిట్: ది థర్డ్ కేస్ సినిమా అనేక అంచనాల మధ్య మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ అని అందరూ అంటున్నప్పటికీ, కలెక్షన్స్ విషయంలో మాత్రం దూసుకుపోతోంది. ఈ సినిమాకు ఏకంగా మొదటి రోజు 43 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. తెలుగుతో సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయిన ఈ సినిమాలో ఒక యంగ్ హీరో మంచి పాత్రను మిస్ చేసుకున్నాడు.

Read More: Black, White & Gray – Love Kills Review: బ్లాక్ వైట్ & గ్రే వెబ్ సిరీస్ రివ్యూ

అతను ఎవరో కాదు, విశ్వక్ సేన్. హిట్: ది ఫస్ట్ కేస్ సినిమాలో హీరోగా నటించిన విశ్వక్ సేన్, ఈ హిట్: ది థర్డ్ కేస్లో కూడా ఒక కీలక పాత్రలో కనిపించాల్సి ఉంది. అంటే, అతను నటించిన మొదటి సినిమా పాత్రలోనే ఈ సినిమాలో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. నిజానికి, హిట్: ది థర్డ్ కేస్లో సెకండ్ కేస్లో నటించిన అడవి శేష్ కూడా కనిపించాడు. అడవి శేష్ ఎంట్రీ సమయంలో థియేటర్లలో అరుపులు, కేకలు వినిపించాయి. అలాంటి ఒక పాత్రలోనే విశ్వక్ సేన్ కూడా కనిపించాల్సి ఉంది.

Read More: Dasari Awards: దాసరి ఫిలిం అవార్డ్స్ ఉత్తమ కథా చిత్రంగా వరలక్ష్మి ‘శబరి’

ఈ మేరకు షెడ్యూల్ అంతా ఫిక్స్ అయిన తర్వాత, విశ్వక్ సేన్ షూట్‌కు హాజరు కాలేని పరిస్థితి ఏర్పడిందట. దీంతో కథలో స్వల్ప మార్పులు చేసి షూట్ చేశారు. అడవి శేష్ ఎంట్రీకి కొద్దిసేపటి ముందు విశ్వక్ ఎంట్రీ కూడా ఉండాల్సి ఉంది. కానీ, విశ్వక్ సేన్ అందుబాటులో లేకపోవడం వల్ల అప్పటికప్పుడు ఆ సన్నివేశాన్ని తొలగించాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే నటించి ఉంటే విశ్వక్ సేన్ కెరీర్‌కు బాగా ప్లస్ అయి ఉండేది. ఎందుకంటే, లైలా లాంటి డిజాస్టర్‌తో ఇబ్బంది పడుతున్న విశ్వక్‌కు ఇలాంటి ఒక మాస్ గెస్ట్ అప్పీరెన్స్ దొరికి ఉంటే, తర్వాతి సినిమాలకు బాగా ఉపయోగపడి ఉండేది.

Exit mobile version