Tollywood Needs a Committee for Workplace Safety and Gender Equality: టాలీవుడ్ లో జానీ మాస్టర్ వ్యవహారం ఒక పెద్ద కుదుపులా వచ్చి పడింది. నిజానికి 2018లో శ్రీ రెడ్డి తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని సినిమా అవకాశాలు ఇస్తానని ఎంతోమంది హీరోలు తనను లైంగికంగా వాడుకున్నారు అంటూ ఆమె అర్ధ నగ్న ప్రదర్శన చేయడంతో అది జాతీయ మీడియాను సైతం ఆకర్షించింది. వెంటనే హడావుడిగా తెలుగు సినీ పరిశ్రమలో కొంతమంది నటీమణులతో పాటు కొంతమంది బయట వ్యక్తులతో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసింది తెలుగు సినీ పరిశ్రమ. ఎవరైనా లైంగిక వేధింపులతో బాధపడుతుంటే ఆ కమిటీని ఆశ్రయించవచ్చని కూడా అప్పట్లో పేర్కొంది. ఆ విషయం సద్దుమణిగి పోయింది అనుకుంటున్న క్రమంలో జానీ మాస్టర్ తన లైంగికంగా వేధించాడు అంటూ ఆయన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఒక యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఇప్పుడు అసలు తెలుగు సినీ పరిశ్రమలో ఆడవారికి రక్షణ ఉందా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
p**n Addiction Tips: అశ్లీల వీడియోలకు వ్యసనంగా మారుతున్నారా?.. అయితే ఈ టిప్స్ పాటించండి
దానికి తోడు కేరళలో ఏర్పాటు చేసిన హేమా కమిటీ రిపోర్టు వెలుగులోకి వచ్చిన కొన్ని రోజులకే ఈ అంశం తెరమీదకు రావడంతో తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఇలాంటి ఒక కమిటీ ఏర్పాటు చేయాలి అనే డిమాండ్ వినిపిస్తోంది. సినీ పరిశ్రమ అనే కాదు దాదాపు అన్ని రంగాలలోనూ మహిళల మీద ఇలాంటి దాడులు కొనసాగుతున్నాయి. అయితే సినీ పరిశ్రమ ఎక్కువగా మీడియాకి ఫోకస్ అయ్యే పరిశ్రమ కావడంతో ఇక్కడ చిన్న విషయం జరిగినా అది పెద్దగానే బయటికి వెళుతుంది. మరియు ముఖ్యంగా ఈమధ్య చోటు చేసుకున్న కొన్ని ఘటనలు తెలుగు సినీ పరిశ్రమ గౌరవాన్ని ప్రశ్నార్థకంగా మార్చేసే పరిస్థితుల్లోకి తీసుకు వెళుతున్నాయి. మరీ ముఖ్యంగా అసలు ఈ అంశం తెరమీదకు రాకముందే సమంత రూత్ ప్రభు, పూనమ్ కవర్ లాంటి వాళ్ళు హేమ కమిటీ లాంటి దాన్ని తెలుగు సినీ పరిశ్రమలో కూడా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
వాళ్లు డిమాండ్ చేశారని కాదు కానీ సినీ పరిశ్రమలో మాత్రమే కాదు అన్ని పరిశ్రమల్లోనూ ఇలాంటి లైంగిక వేధింపులు అంశాలను చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇప్పటికే కార్పొరేట్ రంగంతో పాటు దాదాపు అన్ని రంగాలలో ఈ విషయం మీద చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. ఆడవాళ్లు తాము ఇబ్బంది పడుతున్నామని కంప్లైంట్ చేయగానే ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నవారికైనా క్షణాల్లో చెమటలు పట్టించేలా ఈ రూల్స్ ని డిజైన్ చేశారు. కానీ సినీ పరిశ్రమలో అంత గట్టి రూల్స్ లేవు అని చెప్పాలి. కాబట్టి సినీ పరిశ్రమలో కూడా అంత కఠినమైన రూల్స్ తీసుకురావాలి. అలాగే తమ పబ్బం గడుపు కోవడానికి అసత్య ఆరోపణలు చేసే ఆడవాళ్ళని గుర్తించేలా కూడా ఈ రూల్స్ డిజైన్ చేయాలనే వాదన వినిపిస్తోంది. ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో పోలీసులు సదరు యువతి ఇచ్చిన కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.
కానీ తెలుగు సినీ పరిశ్రమ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది, ఈ ఘటన వరకు ఒక కమిటీ ఏర్పాటు చేసింది కానీ మొత్తానికి ఒక కమిటీ లాంటిది ఏర్పాటు చేసే ప్రయత్నం ఏమి చేయడం లేదు. అయితే తెలుగు సినీ పరిశ్రమ మీడియాలో, అలాగే ప్రజల ముందు చులకన కాకూడదు అంటే ఒక బలమైన లైంగిక వేధింపుల కమిటీ ఉండాలి. చిన్న స్థాయిలో ఉన్న మహిళకు ఇబ్బంది కలిగిన ఆ కమిటీ దృష్టికి తీసుకువెళ్తే న్యాయం జరుగుతుంది అనేలా భరోసా కల్పించగలగాలి. రేప్ వ్యవహారాల విషయంలో పోలీసులు ఎలాగో చర్యలు తీసుకుంటారు.
అయితే అలాంటి పనులు చేసిన వాళ్లని మళ్లీ సినీ పరిశ్రమలో యాక్టివ్ గా పని చేసుకోనివ్వకుండా చేసినప్పుడే ఎవరికైనా ఇలాంటి దుర్బుద్ధి పుట్టకుండా ఉండే అవకాశం ఉంటుంది. నిజానికి ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు దాదాపు అన్ని సినీ పరిశ్రమల్లో చాలామంది హీరోల మీద, దర్శకుల మీద, నిర్మాతల మీద ఇలాంటి లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. కానీ ఎవరు చట్టపరంగా ముందుకు వెళ్ళింది లేదు. ఇక్కడ కూడా పోలీసులు కేసు నమోదు చేశారు కానీ జానీ మాస్టర్ వ్యవహారం ఎంత దూరం వెళుతుందో తెలియదు. కానీ భవిష్యత్తులో తెలుగు సినీ పరిశ్రమ చులకన పాలు కాకూడదు అనుకుంటే కనుక ఒక బలమైన కమిటీని ఏర్పాటు చేస్తేనే మంచిది అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.