NTV Telugu Site icon

Tollywood: నెపో కిడ్స్ కోసం కళ్ళు కాయలు కాచేలా టాలీవుడ్ వెయిటింగ్!

Tollywood

Tollywood

సీనియర్ హీరోల వారసుల ఎంట్రీ.. ఎందుకు లేట్ అవుతుంది…?పవన్ ,బాలయ్య,వెంకీల కొడుకులకు.. ఇంకా ముహూర్తం కుదరడం లేదా…? టాలీవుడ్ నెపో కిడ్స్ ..తమ ఫ్యామిలీ ఫ్యాన్స్ ను సర్ఫైజ్ చేసేది ఎప్పుడు…? అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే టాలీవుడ్ సీనియర్స్… చిరంజీవి,నాగార్జున తప్ప మిగిలిన బాలయ్య, వెంకీ, పవన్ లు తమ వారసులను ఫీల్డ్ లోకి ఇంకా తీసుకురాలేదు. ఆ మాటకొస్తే ఫ్యాన్స్ కు ఆ వెలితి అలాగే ఉంచారు. ఈ గ్యాప్ ఫిల్ చేయమని గత కొన్నిరోజులుగా ఆయా హీరోలపై అభిమానుల ఒత్తిడిని తెస్తున్నారు. ముందుగా బాలయ్య బాబు తన కొడుకు మోక్షజ్ణను దర్శకుడు ప్రశాంత్ వర్మతో ఎంట్రీ ఇప్పించాలని చూశాడు. అయితే రకరకాల కారణాలతో ముహూర్తం లేట్ అవుతూ వస్తోంది. డాకు మహారాజ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ పండగను సెలబ్రేట్ చేసుకుంటున్న బాలయ్యను తాజాగా మరోసారి మోక్షజ్ణ ఎంట్రీపై అభిమానులతో పాటు బంధువులు ఆరా తీశారట. దీంతో ముందుగా చెప్పినట్లుగానే ఈ ఏడాదే కొడుకును తెరపైకి తీసుకువస్తానని హామి ఇచ్చారట. ఇక విక్టరీ వెంకటేష్ కొడుకు విషయంలోను రీసెంట్ గా ఇలాంటి ప్రశ్నలే లేవనెత్తారు.అర్జున్ రాక కోసం అభిమానులు వెయిటింగ్ అని చెప్పడంతో వెంకీ ఆన్సర్ చేయాల్సి వచ్చింది.

Saif Ali Khan: సైఫ్ మొదటి భార్య ఎవరు, విడాకుల తర్వాత అతను ఎన్ని కోట్లు చెల్లించాడో తెలుసా??

దానిలో భాగంగా…త‌న కొడుకు అర్జున్ వ‌య‌సు 20 సంవ‌త్స‌రాలు అని, ప్ర‌స్తుతం అమెరికాలో చదువుకుంటున్నాడ‌ని వెంక‌టేష్ చెప్పాడు. అటు అర్జున్ హీరోగా రావడం, రాక పోవడం అనేది కంప్లీట్ గా అతని ఇంట్రెస్ట్ కే వెంకీ వదిలేసినట్లుగా తెలుస్తుంది. రానా విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు తప్ప హీరోగా నిలబడలేదు. దగ్గుబాటి వారసుడిగా ఆ వెలితిని వెంకటేష్ ఫిల్ చేస్తాడనే నమ్మకాల్లో ఇటు విక్టరీ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ గురించి చాలాకాలంగా మెగా ఫ్యాన్స్ నెట్టింట్లో డిస్కషన్స్ ,డిబేట్లు పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంట్రీ అనే చర్చ ఆ మధ్య జరిగింది.రేణుకాదేశాయ్ కూడా కొడుకుని హీరో చేయాలని అతనికి అన్ని రకాల విద్యలు నేర్పిస్తుంది. ఇప్పటికే తండ్రిలా కర్రసాము, కత్తిసాముల్లో ఎక్స్ పర్ట్ అయిన అకీరా… ఓజీలో స్పెషల్ అప్పీరియన్స్ ఇస్తాడని రూమర్స్ వస్తున్నాయి. అయితే ఓజీ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రమే అకీరా కాంట్రిబ్యూషన్ ఉంటుందని తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ మళ్లీ డిజప్పాయింట్ అయ్యారు. ఏది ఏమైనా టాలీవుడ్ ఆడియన్స్ నెపో కిడ్స్ కోసం ఇంతలా ఈగర్ గా వెయిట్ చేయడంపై అటు నేషనల్ మీడియా కూడా ఆసక్తి చూపిస్తుంది.

Show comments