NTV Telugu Site icon

Actors Direction: యాక్టింగ్ చేస్తూనే డైరెక్టర్లుగా హిట్స్.. మరి మనోళ్లు?

Movie Shooting

Movie Shooting

ఇండియన్ సినిమాను టాలీవుడ్ లీడ్ చేస్తోంది. అందులో నో డౌట్. కానీ సక్సెస్ రేష్యో ఎక్కువగా చూస్తోంది మాలీవుడ్. వర్సటాలిటీకి సౌత్ సినిమాలకు దిక్సూచిగా మారింది. గొప్పగా చెప్పుకునే కథలు లేవు, తీసిపడేసేంత స్టోరీలు కావు. కానీ వాటిని టేకప్ చేస్తున్న డైరెక్టర్లది, హీరోలదే క్రెడిట్. ఫిల్మ్ మేకర్స్ టాలెంట్‌కు కొదవ లేదు. అలా అని హీరోలు కూడా ఒకే స్టీరియో టైప్ లైఫ్‌కు స్టిక్ ఆన్ కావట్లేదు. దర్శకులుగా, నిర్మాతలుగా ఫ్రూవ్ చేసుకుంటున్నారు. ప్రొడక్షన్ చేయడం పక్కన పెడితే మెగా ఫోన్స్ పట్టి.. అద్భుతమైన చిత్రాలను అందిస్తున్నారు.

పృథ్వీరాజ్ సుకుమారన్, బాసిల్ జోసెఫ్, వినీత్ శ్రీనివాసన్ లాంటి యంగ్ మలయాళ హీరోలు.. హీరోలు గానే కంటిన్యూ కావట్లేదు. మెగా ఫోన్ పట్టి సక్సెస్ ఫుల్ చిత్రాలు అందిస్తున్నారు. వీరే కాదు సీనియర్ హీరోస్ మోహన్ లాల్, జోజు జార్జ్ వంటి స్టార్ హీరోలు సైతం దర్శకులుగా మారారు. కోలీవుడ్, శాండిల్ వుడ్‌లో యాక్టర్లు సైతం.. డైరెక్టర్లుగా ప్రూవ్ చేసుకుంటున్నారు. ధనుష్, ఆర్జే బాలాజీ, ఎస్ జే సూర్య, సుందర్ సి, కమల్ హాసన్ లాంటి హీరోలు.. యాక్టింగ్ చేస్తూనే కట్, యాక్షన్ చెబుతున్నారు. శాండిల్ వుడ్‌లో ఉపేంద్ర, సుదీప్, రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి వంటి స్టార్స్.. ఫిల్మ్ మేకర్లుగా సత్తా చాటుతున్నారు. కథ, స్క్రీన్ ప్లేను ఫర్ ఫెక్ట్‌గా ప్రజెంట్ చేసి.. వీరంతా సక్సెస్ అందుకుంటున్నారు. తెలుగు హీరోల ప్రస్తావనకు వస్తే.. డైరెక్షన్ డిపార్ట్మెంట్ పై అంత ఇంట్రస్ట్ చూపట్లేదు

మిగిలిన ఇండస్ట్రీ హీరోలతో పోలిస్తే టాలీవుడ్ హీరోలకు ఏ విషయంలోనూ తక్కువ తీయలేం. చెప్పాలంటే.. అన్నింటిలోనూ ఎక్కువే. కానీ కేవలం యాక్టింగ్ కు మాత్రమే పరిమితమైపోతున్నారు. టాలీవుడ్ హీరోలు.. హీరోలుగానే మిగిలిపోతున్నారు. కేవలం యాక్టింగ్ చేశామా, వెళ్లిపోయామా అన్నట్లుగా ఉంది పరిస్థితి. కొంత మంది నిర్మాతలుగా రాణిస్తున్నా.. ఫిల్మ్ మేకర్లుగా ఛేంజ్ అయ్యేందుకు ఇంట్రస్ట్ చూపట్లేదు. విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ లాంటి యంగ్ హీరోలు సైతం.. మెగా ఫోన్ పట్టేందుకు ఆలోచిస్తున్నారు. అడవి శేష్ మొత్తానికి పక్కన పెట్టేశాడు. వీరంతా హీరోలుగానే బిజీ అవుతున్నారు. టాలీవుడ్‌లో దర్శకులకు కొదవ లేదనుకున్నారో.. లేక ఫిల్మ్ మేకింగ్ లాంటి టఫ్ జాబ్ మనకెందులే అనుకుంటున్నారో వారికే తెలియాలి.