NTV Telugu Site icon

Ntv Exclusive: దేవర 2 లోకి సర్ప్రైజ్ పాత్రల ఎంట్రీ?

Devara

Devara

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా ద్వారా ఒక సరికొత్త ప్రపంచాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది అని అప్పట్లోనే ప్రకటించారు. కథ కూడా అలాగే డిమాండ్ చేసింది. అయితే ఇప్పుడు దేవర సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ లాక్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు కొరటాల శివ పూర్తి స్క్రిప్ట్ ఎన్టీఆర్ కి నేరేట్ చేయగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

IOCL Recruitment 2025: కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్స్.. నెలకు రూ. 1.4 లక్షల జీతం.. అస్సలు వదలొద్దు

ప్రస్తుతానికి ఎన్టీఆర్ వార్ 2 సినిమా ప్యాచ్ వర్క్ తో పాటు ప్రశాంత్ ఎన్టీఆర్ నీల్ సినిమా షూటింగ్ చేయాల్సి ఉంది. వాటి సంగతి పక్కన పెడితే జూన్ నుంచి ఈ దేవర 2 సినిమాని పట్టాలెక్కించే ప్రయత్నాలు కొరటాల శివ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దేవర 2 లోకి సర్ప్రైజ్ పాత్రల ఎంట్రీ కూడా ఉండనుందని అంటున్నారు. నిజానికి కొరటాల శివ దర్శకత్వంలో దేవర 2 సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులతో పాటు దేవర అభిమానులు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ లో కథ నడిపించిన తీరు అంత ఆసక్తికరంగా ఉండడంతో సెకండ్ పార్ట్ లో ఏం జరగబోతున్నదా అనే విషయం మీద చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద కళ్యాణ్ రామ్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్ మీద సుధాకర్ మిక్కిలినేని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.