NTV Telugu Site icon

Sreeleela: బాలీవుడ్ హీరోతో శ్రీ లీల డేటింగ్ వెనుక అసలు కథ ఇదా?

Sreeleela

Sreeleela

తెలుగమ్మాయి అయినా కర్ణాటకలో సెటిల్ అయిన శ్రీ లీల తెలుగులో పెళ్లి సందD అనే సినిమాతో పరిచయం అయింది. ఒక్క సినిమాతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాతో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతానికి హిట్స్ లేకపోయినా ఆమెకు చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అయితే కొద్దిరోజుల క్రితం ఆమె బాలీవుడ్ లో ఒక సినిమా చేసేందుకు వెళ్లింది. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా ఎంపికైంది. అయితే అలా ఎంపిక అయిందో లేదో వెంటనే ఆమె కార్తీక్ ఆర్యన్ తో ప్రేమలో పడిందని వారిద్దరూ రేటింగ్ చేస్తున్నారనే వార్తలు బాలీవుడ్లో మొదలయ్యాయి. అయితే తెలుగులో ఆమెకు ఇలాంటి డేటింగ్ వార్తలు పెద్దగా రాలేదు. దీంతో ఆమె అభిమానుల సైతం నిజంగానే ఆమె కార్తీక్ ఆర్యన్ ను ఇష్టపడిందేమో అనుకున్నారు.

Mohan Babu – Soundarya: మోహన్ బాబు తప్పేం లేదు.. సౌందర్య భర్త కీలక వ్యాఖ్యలు

కానీ దాని వెనుక బాలీవుడ్ పిఆర్ స్టెంట్స్ ఉన్నాయని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే కార్తీక్ ఆర్యన్ గతంలో ఏ హీరోయిన్తో నటించిన ఆ హీరోయిన్ తో డేటింగ్ అంటూ వార్తలు వచ్చేవి ఇదంతా కేవలం ఆయన నటిస్తున్న సినిమాల మీద క్రేజ్ తీసుకు రావడానికే అని తెలుస్తోంది. దానికి తోడు ఇటీవల జైపూర్‌లో జరిగిన IIFA 2025 కార్యక్రమంలో కార్తీక్ ఆర్యన్ తల్లి చేసిన కొన్ని కామెంట్స్ కూడా వీరి రిలేషన్ కి మరింత ఊతం ఇచ్చేలా చేశాయి. కార్తీక్ ఆర్యన్ తల్లిని మీ కోడలిగా ఓ నటి వస్తే ఇష్టపడతారా అని హోస్ట్ కరణ్ జోహార్ ప్రశ్నించినప్పుడు, ఆమె “మా కుటుంబ డిమాండ్ డాక్టర్ కావడమే” అని సమాధానం ఇచ్చింది, అంటే కార్తీక్ ఆర్యన్ భార్యగా మొత్తం కుటుంబం ఓ డాక్టర్ ని కోరుకుంటున్నట్లు హింట్ ఇచ్చిందన్నమాట. శ్రీ లీల డాక్టర్ కావడంతో ఆమె గురించే మాట్లాడిందని అందరూ అనుకున్నారు. .