Site icon NTV Telugu

Samyuktha Menon: సంయుక్త మీనన్‌ రెమ్యునరేషన్‌ కోసం కక్కుర్తి పడిందా?

Samyuktha Menon

Samyuktha Menon

సాధారణంగా నటీమణులు తమ కెరీర్‌లో ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకోవడానికి చాలా కష్టపడతారు. ఆ ఇమేజ్‌ని కాపాడుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటుంది నటి సంయుక్త మీనన్‌. అచ్చం పద్ధతికి లంగా ఓణీ వేసినట్టుగా, తెలుగు ప్రేక్షకులకు ఎంతో నచ్చిన డిగ్నిఫైడ్ రోల్స్ చేసిన సంయుక్త, ఇప్పుడు తీసుకున్న ఒక నిర్ణయం అభిమానులను, సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సంయుక్త మీనన్‌ అంటే, అందమైన నవ్వు, చక్కటి నటన, ముఖ్యంగా గ్లామర్‌కు దూరంగా, డీసెంట్‌గా కనిపించే పాత్రలే గుర్తొస్తాయి. ‘సార్’, ‘బింబిసార’, ‘విరూపాక్ష’ వంటి చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు ఆమెకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ‘సార్’ సినిమాలో టీచర్‌గా ఆమె చేసిన డిగ్నిఫైడ్ రోల్‌, సాయి పల్లవి, నిత్యా మీనన్ వంటి నటీమణుల తరహాలో పెర్ఫార్మెన్స్‌కే ప్రాధాన్యత ఇస్తుందనే మంచి అభిప్రాయాన్ని క్రియేట్ చేసింది.

Also Read : Keeravani : గ్లోబల్ సమ్మిట్ లో కీరవాణి కచేరి

అయితే, తాజాగా బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2’ చిత్రంలో సంయుక్త ఐటమ్ సాంగ్ (‘జాజికాయ సాంగ్’) చేయబోతోందనే వార్త అందరినీ షాక్‌కి గురిచేసింది. అంతేకాకుండా, అందులో ఆమె చేసిన స్కిన్ షో, మాస్ స్టెప్పులు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉండటం అభిమానుల మనసుల్లో పెద్ద ప్రశ్నను లేవనెత్తింది. ఈ అనూహ్యమైన మార్పు వెనుక కారణం ఏమిటనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. మెయిన్ హీరోయిన్‌గా కాకుండా, కేవలం ఒక పాట కోసం ఇంతటి గ్లామర్ డోస్‌ను పెంచాల్సిన అవసరం సంయుక్తకు ఏమొచ్చింది? సాధారణ పాత్రల కంటే మాస్ హీరోల సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌కి ఇచ్చే పారితోషికం (రెమ్యునరేషన్) చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే, భారీ మొత్తంలో పారితోషికం ఆశించి సంయుక్త ఈ పాట చేయడానికి ఒప్పుకుందని భావిస్తున్నారు.

Also Read : Akhanda 2: అందుకే నైజాం బుకింగ్స్ ఆలస్యం.. మరి కాసేపట్లో?

నందమూరి బాలకృష్ణ లాంటి స్టార్ హీరో సినిమాలో, పైగా బోయపాటి శ్రీను లాంటి మాస్ డైరెక్టర్‌తో కలిసి పనిచేయడం అనేది ఒక క్రేజీ ఛాన్స్. ఈ అవకాశాన్ని వదులుకోకూడదనే ఉద్దేశంతో తొందరపడి నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. కెరీర్‌లో ఫస్ట్ టైం మాస్ పాట చేస్తోంది కదా అని, ఆ ఉత్సాహంలోనే పెర్‌ఫార్మెన్స్ కంటే గ్లామర్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, రెచ్చిపోయి ఉండవచ్చు. సంయుక్త మీనన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆమె అభిమానుల్లో బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసిందనడంలో సందేహం లేదు. ఇంతకాలం ఆమె పద్ధతైన రోల్స్‌కే కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. కానీ, ఒక్క పాటతో ఆమె ఆ ఇమేజ్‌ను పూర్తిగా మార్చేసుకునే ప్రయత్నం చేసిందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకే ఒక తప్పు ఆమె కూడగట్టుకున్న పాజిటివ్ ఇమేజ్‌ను దెబ్బతీసి, ఆమె కెరీర్‌కి ఒక మచ్చ తెచ్చిందా? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నిర్ణయం ద్వారా ఆమె పద్ధతైన రోల్స్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసినట్టేనా? లేక ఇది కేవలం ఒక ప్రయోగం మాత్రమేనా? అనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.

Exit mobile version