Site icon NTV Telugu

Tollywood: స్టార్ హీరో సినిమా షూటింగ్.. సరైన తిండి కూడా పెట్టలేదట

Tollywood

Tollywood

ఒక పాన్ ఇండియా స్టార్ హీరో, మరో పాన్ ఇండియా డైరెక్టర్ వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఒక పెద్ద నిర్మాణ సంస్థతో పాటు మరో నిర్మాణ సంస్థ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకుంటుంది. ఈ మధ్యనే ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలకమైన షెడ్యూల్ మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా వేరే రాష్ట్రంలో షూట్ చేశారు. ఈ షూటింగ్ జరిగినప్పుడు అనుకోని సంఘటనలు కొన్ని చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read:Heroines : హీరోయిన్ల ఘాటు అందాలు.. ఆఫర్లు తెచ్చిపెడుతున్న ఐటెం సాంగ్స్..

సాధారణంగా అవుట్‌డోర్ షూటింగ్ అంటే ఎంతో మంది టెక్నీషియన్లు అవసరమవుతారు. పేరొందిన టెక్నీషియన్లు మాత్రమే కాదు, లైట్ బాయ్ నుంచి సెట్ అసిస్టెంట్ వరకు ఎంతో మందిని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తారు. అయితే, వారందరూ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు ఫుడ్ విషయంలో చాలా ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రొడక్షన్ ఫుడ్ నచ్చకపోతే బయటకు వెళ్లి తినే అవకాశం ఉంటుంది. కానీ, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడి ఫుడ్ మనవాళ్లు తినలేక ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సినిమా షూటింగ్ విషయంలో కూడా అదే జరిగినట్లు తెలుస్తోంది.

Also Read:Jayam Ravi: నెలకి 40 లక్షల భరణం వార్తలు.. స్టార్ హీరో భార్యకి కౌంటర్

యూనిట్‌కు సరైన ఫుడ్ అందించడంలో సినిమా ప్రొడక్షన్ టీమ్ విఫలమైనట్లు తెలుస్తోంది. సినిమా షూట్‌కు వెళ్ళిన నటీనటులతో పాటు టెక్నీషియన్లందరికీ ఈ ఇబ్బంది ఎదురైనట్లు చెబుతున్నారు. మెయిన్ కోర్ టీమ్ వరకు ఈ ఇబ్బంది ఎదురవనివ్వలేదు, కానీ మిగతా వారందరికీ ఫుడ్ విషయంలో చాలా ఇబ్బంది జరిగినట్లు తెలుస్తోంది. ఒక పాన్ ఇండియా హీరో, పాన్ ఇండియా డైరెక్టర్, పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న నిర్మాణ సంస్థతో సినిమా చేస్తున్నప్పుడు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే, అది దీర్ఘకాలంలో ఇబ్బంది కలిగించే అంశం అవుతుంది.

Exit mobile version