Site icon NTV Telugu

OTT: ఓటీటీలూ చేతులెత్తేశాయ్

Ott

Ott

అనుకున్నంత అయింది. ఇప్పటివరకు నెమ్మదిగా సినిమాల రిలీజ్ డేట్‌ల మీద, సినిమాల అనౌన్స్‌మెంట్ల మీద పెత్తనం చెలాయిస్తూ వచ్చిన ఓటీటీ (OTT) సంస్థలు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశాయి. ఇప్పటివరకు ఓటీటీ సంస్థలు ఒక సినిమాని దాదాపుగా అవుట్‌ రేట్‌కి కొనేసేవాళ్ళు. అంటే, కాంబినేషన్ బట్టి లేక మరే ఇతర క్రేజ్‌నో బట్టి ఒక సినిమాకి పది కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే, ఆ పది కోట్లు కట్టాల్సిందే. అడ్వాన్స్‌గా కొంత కట్టి, సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యే లోపు మిగతాది కట్టేవాళ్లు. 6అలా కడితేనే నిర్మాతలు కంటెంట్ ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా అగ్రిమెంట్లు కూడా అయ్యేవి.

Also Read :Baahubali The Epic : ఆ సీన్ నాకు ఎప్పటికీ స్పెషల్.. రాజమౌళి, ప్రభాస్ ఇంటర్వ్యూ..

కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఒక సినిమా కొనుగోలు చేసిన తర్వాత, థియేటర్‌లో ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సరే, ఓటీటీ సంస్థలు ముందు అనుకున్న రేటు ఇచ్చేసేవి. కానీ, ఇప్పుడు చాలా సినిమాలు ముందు భారీ రేటుకి కొనుగోలు చేసిన తర్వాత, థియేటర్లలో బోల్తాపడుతున్న నేపథ్యంలో, ఓటీటీ సంస్థలు అగ్రిమెంట్లు మార్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

Also Read :Trains Cancelled: మెంథా తుఫాన్ ఎఫెక్ట్.. భారీగా రైళ్ల రద్దు..

ఒకవేళ సినిమా హిట్ అయితేనే అనుకున్నంత ఇస్తామని, లేదంటే అనుకున్న దానిలో కచ్చితంగా కటింగ్స్ ఉంటాయని చెబుతున్నారట. క్రేజ్ ఉన్న సినిమాలైనా సరే వెనక్కి తగ్గకుండా, ఈ మేరకు అగ్రిమెంట్లు చేయించుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం క్లారిటీ లేదు కానీ, ఈ మేరకు పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది. ఫిలింనగర్ వర్గాల్లో జరుగుతున్న ఈ ప్రచారం నిజమైతే మాత్రం, నిర్మాతలకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవనే చెప్పాలి.

Exit mobile version