సాధారణంగా సంక్రాంతి సీజన్ అంటే సినిమా వాళ్లకు పండుగ సీజన్. అదేంటి పండగ సీజన్ ఎవరికైనా పండుగ సీజనే కదా అంటే సినిమా వాళ్లకు మాత్రం అది ఇంకా స్పెషల్ అని చెప్పొచ్చు. సంక్రాంతి సీజన్ లో రావాల్సిన సినిమాల తాలూకా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్లు ఏడాది ముందు నుంచే జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనే విషయం మీద ఎంత తక్కువలో లెక్క వేసుకున్నా రెండు మూడు నెలల ముందే క్లారిటీ వస్తుంది. సంక్రాంతి సినిమా వాళ్లకు కీలకమైన సీజన్ కావడంతో చాలా సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. భారీగా వసూళ్లు దక్కే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సీజన్ మీద అందరూ నిర్మాతలు ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. కానీ 2025 సంక్రాంతి విషయంలో మాత్రం ఇప్పటికీ సరైన క్లారిటీ రావడం లేదు. నిజానికి ఈ సీజన్లో ఎన్ని సినిమాలు వస్తాయి అనే విషయం మీద క్లారిటీ లేక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
Lubber Pandhu : తెలుగులోకి తమిళ్ సూపర్ హిట్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
నిజానికి ఈ సీజన్లో రిలీజ్ అవుతాయి అంటూ దాదాపు 6 సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వచ్చాయి. అయినా సరే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా తప్ప ఇప్పటివరకు రిలీజ్ డేట్ ప్రకటించలేదు. అయితే ఈ సీజన్లో కేవలం మూడు నాలుగు సినిమాలే రాబోతున్నాయి కాబట్టి సంక్రాంతి సినిమాల మధ్య పెద్ద పోటీ ఉండదని నిర్మాత నాగవంశీ ప్రకటించారు. ఆయన చెబుతున్న దాని ప్రకారం గేమ్ చేంజెర్ సినిమాతో పాటు బాలయ్య సినిమా అలాగే మరో రెండు సినిమాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మైత్రి నిర్మాణంలో తమిళ హీరో నటించిన గుడ్ బాడ్ అగ్లీ కూడా సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ కూడా పెట్టేశారు కాబట్టి సంక్రాంతికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తన సినిమాలే రెండు రిలీజ్ చేయడానికి దిల్ రాజు రెడీ అవుతున్నారంటే ఈ సీజన్ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. దానికి తోడు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న మజాకా సినిమాతో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వామన అనే సినిమా కూడా ఈ సంక్రాంతికి రావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నాగచైతన్య తండేల్ కూడా ఇదే సంక్రాంతికి రిలీజ్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది.. ఒకవేళ రామ్ చరణ్, బాలయ్య, వెంకటేష్, నాగచైతన్య సినిమాలు గనక వస్తే మజాకా, వామన వాయిదా పడే అవకాశం ఉంది. ఎలా చూసుకున్నా సుమారు ఆడజన్ సినిమాలు సంక్రాంతి బరిలో దిగే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. అయితే నిర్మాతలందరూ కలిసి కూర్చుని కేవలం నాలుగు సినిమాలను మాత్రమే సంక్రాంతికి రిలీజ్ చేయించే ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అంతకుమించి సినిమాలు రిలీజ్ అయితే థియేటర్ల సర్దుబాటు సహా కలెక్షన్ల మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంక్రాంతికి నాలుగు సినిమాల వరకు రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏ ఏ సినిమాలు వస్తున్నాయి అనేది మాత్రం నిర్మాతలు అందరూ కూర్చున్నాక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.