NTV Telugu Site icon

Pushpa 2: పుష్ప గాడికి ఎదురు నిలిచేదెవరు?

Pushpa Raj

Pushpa Raj

అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ ఐదో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. నిజానికి సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప మొదటి భాగం రిలీజ్ అవుతున్నప్పుడు ఈ సినిమా ఈ రేంజ్ హిట్ అవుతుందని టీం తప్ప బయట వాళ్ళు ఎవరు అనుకుని ఉండరు. కానీ రిలీజ్ అయిన తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా కలెక్షన్స్ మంచిగానే వచ్చాయి. దానికి తోడు ఊహించని విధంగా హిందీ బెల్ట్ లో సినిమా గట్టిగా నడిచింది. అల్లు అర్జున్కి విపరీతమైన క్రేజ్ తీసుకురావడమే కాక తెలుగు సినిమాకి మరొక బ్లాక్ బస్టర్ హిట్ అందేలా చేసింది. అయితే ఈ దెబ్బతో ఇప్పుడు పుష్ప 2 మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది టీం. రీ షుట్లు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది కానీ నిర్మాతలు అవేమీ లేదంటున్నారు. మొత్తం మీద ఒక రకంగా సుకుమార్ ఈ పుష్ప 2 సినిమాని జక్కన్న చెప్పినట్టే చెక్కుతున్నాడు.

ఎక్కడ అనుమానం వచ్చినా దాన్ని మార్చేస్తూ అవసరమైన మార్పులు చేర్పులు చేస్తూ సినిమాని ఒక అద్భుతమైన ఘట్టంగా ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ సినిమాతో పోటీ పడడానికి మరే సినిమాలు సాహసం చేయడం లేదు. తాజాగా ఈ సినిమాతో పోటీ పడలేక విక్కీ కౌశల్ హీరోగా నటించిన చావా సినిమా వెనక్కి తగ్గబోతోంది. ఎందుకంటే హిందీలో సినిమాని రిలీజ్ చేస్తున్న అనిల్ తడాని పుష్ప 2 సినిమాకి చాలా అద్భుతమైన స్క్రీన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పుష్పతో పోటీ పడడం కంటే వెనక్కి తగ్గడం బెటర్ అని భావిస్తూ వెనక్కి తగినట్లుగా తెలుస్తోంది. కేవలం ఆ సినిమా మాత్రమే కాదు ఇతర భాషల్లో కూడా పుష్పా 2 రిలీజ్ అవుతుందంటే అదేదో డైరెక్ట్ సినిమా లాగానే ఇతర సినిమాలను పక్కన పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

ఒకరకంగా అల్లు అర్జున్ ఇప్పుడు అసలు అపోజిషనే లేకుండా దూసుకుపోతున్నాడని చెప్పొచ్చు. నిజానికి పుష్పా 2 సినిమాకి ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 1000 కోట్ల వరకు జరిగింది. ఒక్క నాన్ థియేట్రికల్ రైట్స్ మాత్రమే దాదాపు 420 కోట్ల వరకు అమ్ముడు అయ్యాయి. థియేటర్లలో ఈ సినిమా ఖచ్చితంగా మరోసారి రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా చాలా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్తో పోటీ పడటం కంటే సైలెంట్ గా ఉండటమే బెటర్ అని కొందరు దర్శక నిర్మాతలు తమ సినిమాలను పక్కన పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా అల్లు అర్జున్ క్రేజ్ చూస్తే ఇప్పుడు మార్కెట్లో మెంటల్ ఎక్కిపోవడం ఖాయమని డైలాగ్స్ వినిపిస్తున్నాయి. చూడాలి పుష్ప 2తో ఎన్ని వందల కోట్లు కొల్లగట్టి అల్లు అర్జున్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయబోతున్నాడు అనేది.

Show comments