Site icon NTV Telugu

Tamil Audience : మీరు మారరు.. ఇంకెందుకు ఏడుపు?

Movie Theatres To Reopen in Telangana From July 1st ?

ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన కుబేర సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలు రాబడుతోంది. నిజానికి, ఈ సినిమాని శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళంలో సూపర్ స్టార్‌గా ఉన్న ధనుష్ హీరోగా నటించడంతో ఇక్కడ బాగా ఆడుతున్న ఈ సినిమా తమిళంలో కూడా మంచి బూస్ట్ వస్తుందని నిర్మాతలు భావించారు. అయితే, తమిళనాడులో మాత్రం ప్రేక్షకులు చేతులెత్తేశారు. అలా అని సినిమా బాలేదా అంటే, అదేమీ కాదు. విమర్శకుల నుండి ప్రేక్షకుల వరకు సినిమా బాగుందని అంటున్నారు. అయినా సరే, తమిళ ప్రేక్షకులు మాత్రం సినిమా వైపు చూడటం లేదు. ఇలా చేయడం తమిళ ప్రేక్షకులకు ఇది మొదటిసారి కాదు.

Also Read:Tollywood: త్వరలో టాలీవుడ్ కీలక సమావేశం

గతంలో ధనుష్ నటించిన సార్ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. అయితే, ఇక్కడ తెలుగు దర్శకుడు, తెలుగు నిర్మాత కాబట్టి సినిమాని పక్కన పెట్టారని అనుకుంటే, అది కొంతవరకు మాత్రమే కరెక్ట్. ఎందుకంటే, గతంలో తమిళ నిర్మాత నిర్మించగా, తమిళ దర్శకులే దర్శకత్వం వహించిన వీర ధీర శూరన్, తంగలాన్, కంగువా, తమిళ సత్యం సుందరం లాంటి సినిమాలను కూడా వారు పెద్దగా ఆదరించలేదు. వాటి స్థానంలో గుడ్ బ్యాడ్ అగ్లీ, లియో, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం లాంటి హీరోయిజం బ్యాక్‌డ్రాప్ ఉన్న సినిమాలను మాత్రమే ఆదరించారు.

Also Read:Sruthi Haasan: శృతి హాసన్ ట్విట్టర్(X) అకౌంట్ హ్యాక్!

ఒక విధంగా చెప్పాలంటే, తమిళ ఆడియన్స్ సినిమా కంటెంట్ కంటే హీరో ఎలివేషన్స్, హీరోలను ఆధారంగా చేసుకుని చేసిన సినిమాలను మాత్రమే ఆదరిస్తూ వచ్చారు. కానీ, తెలుగు ఆడియన్స్ మాత్రం అలా కాదు. తెలుగు ఆడియన్స్‌కి కంటెంట్ నచ్చితే, అది తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, అవసరమైతే భోజ్‌పురి, బెంగాలీ, ఒడియా లాంటి భాషల సినిమాలను కూడా చూసి ఆదరించేందుకు ఏమాత్రం వెనుకాడరు. కానీ, తమిళ ఆడియన్స్ మాత్రం ఈ విషయంలో అక్కడే ఆగిపోయారు. అందుకే 2015లో బాహుబలి సృష్టించిన రికార్డుని ఇప్పటికీ ఒక్క తమిళ సినిమా కూడా బద్దలు కొట్టలేక పోతోంది.

Exit mobile version