ఈ ఏడాది కోలీవుడ్ మిక్స్‌డ్ రిజల్ట్స్ చూసింది. స్టార్ హీరోలంతా నిర్మాతలను నిండా ముంచేస్తే.. చిన్న హీరోలు ఇండస్ట్రీని నిలబెట్టారు. భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ ముంగిట్లో బోల్తా పడ్డ సినిమాలేవీ..? ఏ హీరోస్ ఫ్యాన్స్‌ను ఖంగుతినిపించారు. జైలర్‌తో గట్టి కంబ్యాక్ ఇచ్చానన్న ఆనందం ఎంతసేపు మిగల్లేదు సూపర్ స్టార్ రజనీకాంత్‌కు. ఫిబ్రవరిలో లాల్ సలాం రూపంలో, అక్టోబర్ వేట్టయాన్ రూపంలో రెండు డిజాస్టర్స్ వచ్చి.. మళ్లీ తలైవా ఛరిష్మాను దెబ్బతీశాయి. కమల్ సిచ్చుయేషన్ కూడా యాజ్ టీజ్. ఎంతో ఈగర్లీగా వెయిట్ చేసిన భారతీయుడు 2 బాక్సాఫీస్ దగ్గర బేర్ మంది. కమల్ అమరన్‌తో నిర్మాతగా సక్సెస్ చూసినప్పటికీ.. హీరోగా భారీ డిజాస్టర్ చవి చూశాడు. హీరోలుగా 2024 ఈ స్టార్లకు అంతగా కలిసి రాలేదు. ఈ ఇద్దరే కాదు.. మరో ఇద్దరు స్టార్ హీరోలు ఇదే లెగసీని కంటిన్యూ చేశారు. వర్సటైల్ నటుడు విక్రమ్ తంగలాన్‌తో, సూర్య కంగువాతో నిర్మాతలను ముంచేశారు.
Pushpa 2: బాక్సాఫీస్ రపరప.. బాలీవుడ్ తగలబడిపోద్ది!
హీరోల డిఫరెంట్ మేకోవర్స్, ఎంతో ఎఫర్ట్స్.. భారీ బడ్జెట్ చిత్రాలను గట్టెక్కించలేకపోయాయి. మేకోవర్స్ కాదు.. కథలో దమ్ము ఉండాలని కోలీవుడ్ ప్రేక్షకులు క్లియర్ రిజల్ట్ ఇచ్చారు తంగలాన్, కంగువా సినిమాల విషయంలో. విజయ్ గ్రేట్ ఆఫ్ ది ఆల్ టైం కూడా ఓకే అనిపించుకుంది కానీ.. సినిమా పరంగా ఫ్యాన్స్‌ను శాటిస్ఫై చేయలేకపోయింది. కెప్టెన్ మిల్లర్, అయలాన్ కూడా పేరుకు హిట్టే కానీ.. భారీ ప్రాఫిట్స్ చూడలేదు. ఇవన్నీ విపరీతమైన బజ్ క్రియేట్ చేసి.. అంచనాలు అందుకోవడంలో తడబడ్డాయి. బిగ్ స్టార్స్ ప్రొడ్యూసర్లను ముంచి.. ఫ్యాన్స్‌కు నీరసం తెప్పిస్తే.. టైర్ 2 అండ్ స్మాల్ హీరోలే ఇండస్ట్రీని ఆదుకున్నారు. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మూవీ మహారాజా గురించి. కమర్షియల్ ఫార్మాట్‌కు దూరంగా తెరకెక్కిన మూవీ.. కోట్లను కొల్లగొట్టింది. ఈ కోవలోకే వస్తోంది అమరన్ కూడా. ఎలాంటి ఎక్స్‌పర్టేషన్స్ లేకుండా వచ్చిన అమరన్ ఏకంగా 300 కోట్లను కొల్లగొట్టింది. ఇవే కాదు కవిన్ స్టార్, సూరీ గరుడన్, ధనుష్ రాయన్, డిమాంటీ కాలనీ 2, కార్తీ మెయ్యళగన్, ఆరణ్మణై 4, లబ్బర్ పందు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అందుకుని.. కాస్తో కూస్తో కోలీవుడ్ పరువును నిలబెట్టాయి. ఈ ఇయర్ చిన్న హీరోల రిజల్ట్స్ చూసి స్టార్ హీరోస్ మిస్టేక్స్ సరిదిద్దుకుంటారో లేక నెక్ట్స్ ఇయర్ ఇదే తీరును కంటిన్యూ చేస్తారో చూడాలి.