NTV Telugu Site icon

Kanguva: తెలుగు కంగువకు ఊహించని దెబ్బ‌?

Kanguva

Kanguva

స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ ‘కంగువ’. మూవీని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ‘కంగువ’ సినిమా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. వెయ్యేళ్ల కిందట ఐదు తెగల మధ్య సాగే పోరాటం నేపథ్యంలో, ఓటమి ఎరుగని ధీరుడైన నాయకుడు కంగువ ఒకవైపు, ప్రస్తుత కాలంలో స్టైలిష్ హీరోను మరోవైపు చూపిస్తూ ట్రైలర్ కట్స్ చేయడంతో ఈ సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమా రిలీజ్ కి ముందే కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి.

Mahesh Babu: కృష్ణుడు కాదు.. రాముడిగా మ‌హేష్‌?

అదేమంటే తెలుగులో ముఖ్యంగా నైజాంలో కంగువా చిత్రాన్ని మైత్రీ మూవీస్ విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మైత్రీ అంటే ఏపీ, తెలంగాణ‌ల్లో భారీగా థియేట‌ర్లు దొరుకుతాయ‌ని అనుకుంటారు. అయితే దానికి భిన్నంగా సూర్య కంగువకు అనుకున్నంత స్థాయిలో థియేట‌ర్లు దొరక లేదు. దానికి కార‌ణం మైత్రీ తీసుకున్న ఒక నిర్ణయం అని తెలుస్తోంది. అదేమంటే డిస్ట్రిబ్యూషన్లో చక్రం తిప్పే ప్రయత్నాల్లో భాగంగా మైత్రీ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా తీసుకున్న తాజా నిర్ణయం కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టింది. మాములుగా అయితే సింగిల్ స్క్రీన్స్ లో షేరింగ్ ప‌ద్ధ‌తిలో థియేట‌ర్లు తీసుకొంటుంటారు. కానీ.. ‘కంగువ’ సినిమాకు మాత్రం రెంట‌ల్ ప‌ద్ధ‌తిలో సినిమాలు ఇవ్వాల‌ని మైత్రీ ఫిక్స్ అయింది. ఈ డెసిషన్ దెబ్బకు ఏషియన్ సంస్థ త‌మ థియేట‌ర్లు ‘కంగువ’ సినిమాకు ఇవ్వ‌డానికి ఒప్పుకోలేదు.

ఈ క్రమంలో ఏఎంబీ మ‌ల్టీప్లెక్స్ లో సైతం ‘కంగువ’కు స్క్రీన్లు దొర‌క‌లేదనే చెప్పాయి. షేరింగ్ ప‌ద్ధ‌తిలో అయితేనే తమ మల్టీ ప్లెక్స్ స్క్రీన్లు అని కూడా ఇస్తామ‌ని ఏషియ‌న్ సంస్థ తేల్చి చెప్పింది. మీరు సింగిల్ స్క్రీన్ రేట్లు 175 పెడితే రెంటల్ మాత్రమే ఇస్తాం, అదే 295 పెడితే పర్సెంటేజ్ ఇవ్వడానికి మేము రెడీ అని మైత్రీ అంటోంది. ఏషియన్ రేనోవేట్ చేసిన సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 175 రేటు పెట్టి పర్సెంటేజ్ ఇస్తే మాకు షేర్ ఎక్కువ రావడం లేదని మైత్రీ చెబుతోంది. కానీ ఏషియన్ మాత్రం వెనక్కి తగ్గేది లేదని అంటోంది. అయితే మైత్రీ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డానికి కార‌ణం అల్లు అర్జున్ ‘పుష్ప 2’నే. మైత్రీ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా అంటే ‘పుష్ప 2’ డిసెంబ‌రు 5న రాబోతోంది. పుష్ప 1 రిలీజ్ అయ్యేనాటికి మైత్రీ డిస్ట్రిబ్యూషన్ లో లేదు.

ఇప్పుడు నైజాంలో మైత్రీనే డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. పుష్ప‌కు కూడా ఇలానే షేరింగ్ ప‌ద్ధ‌తిలో థియేట‌ర్లు ఇస్తే, మైత్రీ బాగా న‌ష్ట‌పోవాల్సివ‌స్తుందని ముందు జాగ్రత్త పడింది. ముందుగానే ‘కంగువ’ లాంటి హైప్ ఉన్న సినిమాతో థియేట‌ర్ల‌న్నింటినీ ఓ దారిలోకి తీసుకురావాల‌నుకుని ఇలా ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఆ ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యేలా కనిపించడం లేదు. దానికి తోడు ఇప్పుడు ‘కంగువ’కు థియేట‌ర్లు ఇవ్వ‌క‌పోతే, రేపు ‘పుష్ప‌’కు కూడా థియేట‌ర్ల విషయంలో సమస్య ఎదురు కావచ్చు. అయితే ఇండియన్ సినీ హిస్టరీలో అత్యంత క్రేజ్ ఉన్న సినిమా కాబ‌ట్టి, ‘పుష్ప 2’ సినిమాను రెంట‌ల్ ప‌ద్ధ‌తిలో ఆడిస్తారా, లేదంటే కంగువకు చేసిన‌ట్టే డిమాండ్ చేస్తారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అయితే ఈలోగా కంగువకు కావ‌ల్సిన థియేట‌ర్లు దొరక్క‌పోవ‌డంతో ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ చూపించే ప్ర‌మాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.