NTV Telugu Site icon

Jani Master: జానీ మాస్టర్ జాతీయ అవార్డు రద్దు కరెక్టేనా?

Jani Master Arrest

Jani Master Arrest

Is it Correct to Cancel Jani Master National Award: జాతీయ అవార్డు తీసుకునేందుకు ఢిల్లీకి వెళ్లడానికి రెడీ అయిన జానీ మాస్టర్ కు షాక్ తగిలింది. ఆయనకు ప్రకటించిన బెస్ట్ కొరియోగ్రాఫర్ నేషనల్‌ అవార్డును నిలిపివేస్తూ అవార్డు కమిటీ శనివారం రాత్రి నిర్ణయాన్ని ప్రకటించడం చర్చనీయాంశం అయింది. జానీమాస్టర్‌కు ప్రకటించిన జాతీయ పురస్కారాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నేషనల్​ ఫిల్మ్​ అవార్డ్ సెల్​ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో అవార్డు నిలిపివేస్తున్నట్లు ఆ సెల్​ వెల్లడించింది. నిజానికి 2022 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడిగా జానీ మాస్టర్​ ఎంపికయ్యారు. ఈనెల 8న అంటే రేపే డిల్లీలోని విజ్ఞాన్​భవన్​లో పురస్కారం పొందేందుకు జానీ మాస్టర్​కు ఆహ్వానం అందింది. అయితే పోక్సో కేసు నేపథ్యంలో అవార్డు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు, ఆహ్వానపత్రికను రద్దు చేస్తున్నట్లు ప్రకటనలో నేషనల్​ ఫిల్మ్​ అవార్డు సెల్​ వెల్లడించింది.

Shocking: బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లికి ఒప్పుకోలేదని.. 13 మందికి విషం పెట్టి చంపిన యువతి..

గత సెప్టెంబర్ 16న ప్రముఖ కొరియోగ్రాఫర్​ జానీ మాస్టర్​పై అతని వద్ద పని చేసి ఇప్పుడు స్వతంత్రంగా సినిమాలు చేస్తున్న ఒక కొరియోగ్రాఫర్​ లైంగిక వేధింపుల కేసును పెట్టారు. ఈ వేధింపులు 2019 నుంచి ఉన్నాయని 2017లో జానీ మాస్టర్​ పరిచయం అయ్యారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. 2019లో అతని బృందంలో సహాయ నృత్య దర్శకురాలిగా చేరగా అదే ఏడాది ముంబయిలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం వెళ్లామని తెలిపింది. అక్కడ హోటల్​ గదిలో తనపై జానీ మాస్టర్​ అత్యాచారం చేశారని వెల్లడించింది. ఈ విషయం ఎవరికైనా చెబితే ఇక డ్యాన్స్​ చేయవని బెదిరించినట్లు, సినిమా పరిశ్రమలో ఇక ఎప్పటికీ పని చేయలేవని లొంగ తీసుకున్నట్లు ఫిర్యాదులో తెలిపింది. దీన్ని అవకాశంగా తీసుకున్న జానీ హైదరాబాద్​లో కూడా పలుమార్లు అత్యాచారం చేసినట్లు తెలపగా ఈ మేరకు రాయదుర్గం పోలీస్​ స్టేషన్​ ఫిర్యాదు చేయగా ఆ కేసు నార్సింగికి బదిలీ చేశారు. ఇక పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు.

ఇక ఆ అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యేందుకు జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ కూడా పొందారు. 6 నుంచి 9 వరకు జానీ మాస్టర్ కు బెయిల్ లభించింది. అయితే ఇప్పుడు అవార్డు రద్దు కావడంతో ఆయన బెయిల్ పై బయటకు రావడం కష్టమే. అయితే ఇంకా ఆరోపణలు రుజువు కాకుండా ఇలా జాతీయ అవార్డుని తాత్కాలికంగా రద్దు చేయడం కరెక్ట్ కాదు అనే వాదన వినిపిస్తోంది. జానీ మాస్టర్ మీద ఎవరైనా కావాలనే ఇలా ఆరోపణలు చేయించి ఉండవచ్చు అని అంటున్నారు. ఆయన అవార్డు ప్రకటించిన తర్వాతే ఈ ఆరోపణలు తెరమీదకు వచ్చాయి. ఆయన అవార్డు అందుకోకూడదు అనే ఉద్దేశంతోనే ఎవరైనా రెచ్చగొట్టి ఆమెను ఫిర్యాదు చేయించి ఉండవచ్చు. కాబట్టి ఈ విషయంలో పునరాలోచించాలని జానీ మాస్టర్ అభిమానులు పలువురు సినీ ప్రముఖులు ఆఫ్ ది రికార్డ్ కామెంట్ చేస్తున్నారు. అయితే పోక్సో చట్టం కింద కేసు కావడంతో తమ బాధ్యతగా తన తప్పు లేదని జానీ మాస్టర్ నిరూపించుకునే దాకా దాన్ని తాత్కాలికంగా రద్దు చేయడం కరెక్ట్ అని కొందరు కామెంట్ చేస్తున్నారు.