హరి హర వీరమల్లు (పార్ట్ – 1)…పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తరువాత రిలీజ్ అవుతున్న మొదటి సినిమా. నిజానికి అంతా మొదటి సినిమాగా OG వస్తుంది అనుకుంటే ఎలాంటి అప్డేట్స్ లేకపోయినా సైలెంట్ గా పనిచేసుకుని రిలీజ్ రేస్ లో ముందుకు దూసుకొచ్చారు OG టీమ్. అధికారిక ప్రకటన మేరకు హరి హర వీరమల్లు మార్చ్ 28న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఆ డేట్ కి వీరమల్లు రావడం కష్టంలానే ఉంది.
సరిగ్గా నెలరోజుల సమయం ఉంది.ఇంతవరకు కనీసం టీజర్ కూడా బయటికి రాలేదు. రెండు సాంగ్స్ రిలీజ్ చేసినా OG రేంజ్ మ్యాజిక్ అయితే క్రియేట్ అవ్వట్లేదు.దీంతో స్వయంగా పవన్ రంగంలోకి దిగి ప్రోమోట్ చెయ్యాల్సిన పరిస్థితి.కానీ పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ ఉన్న బిజీకి ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ మినహా మిగతా వాటికి ఎంత టైం కేటాయించగలుగుతారు అనేది చూడాలి.
అయితే వీరమల్లు పోస్ట్ పోన్ దాదాపు ఖాయం అని మిగతా సినిమాల రిలీజ్ డేట్స్ చూస్తే అర్ధం అవుతుంది.వీరమల్లు రిలీజ్ రోజే నితిన్ నటించిన రాబిన్ హుడ్ రిలీజ్ డేట్ వేశారు.నిజంగా వీరమల్లు రిలీజ్ ఉంటే పవన్ కి భక్తుడైన నితిన్ ఆ డేట్ కి అస్సలు ఒప్పుకోడు.అంతేకాదు ఆ సినిమా ప్రొడ్యూసర్స్ అయిన మైత్రి మూవీస్ మేకర్స్ సైతం పవన్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కి నిర్మాతలుగా ఉన్నారు.అంతేకాదు పవన్ కళ్యాణ్ తో ముందు నుండి మంచి సంబంధాలు కలిగివున్నారు.కాబట్టి వాళ్ళు డేర్ చేసి ఆ డేట్ కి రిలీజ్ పెట్టుకోరు.
అలానే మార్చ్ 29న మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ ఉంది. ఆ సినిమా నిర్మాత నాగవంశీ సితార బ్యానర్ లో ఆ సినిమాని నిర్మించారు.పేరుకి సితార అయినా హారిక అండ్ హాసిని సినిమా కాబట్టి పవన్ తో త్రివిక్రమ్ కి,చినబాబుకు ఉన్న సత్సంబంధాల మధ్య ఆ సినిమా రిలీజ్ కి ఎట్టి పరిస్థితుల్లో ముందు రారు.పోనీ ఒక వేళ రిలేషన్ లెక్కలు వేరు, రిలీజ్ లెక్కలు వేరు అనుకున్నా కూడా అంత పోటీలో వీరమల్లుని రిలీజ్ చెయ్యడానికి AM రత్నం ముందుకు రాకపోవచ్చు.సోలో రిలీజ్ ఉంటే సేఫ్ అనే లెక్క ఉంటుంది.
అలా వీరమల్లు వాయిదా పడి ఏప్రిల్ రిలీజ్ కి వస్తే అక్కడ కాచుకుని ఉన్నజాక్,ఘాటీ,కన్నప్ప సినిమాలు వేరే డేట్స్ వెదుక్కోవాల్సి వస్తుంది.అదే జరిగితే మిగతా సినిమాలు ఓకే కానీ ఎప్పుడో డేట్ కన్ఫర్మ్ చేసుకున్న కన్నప్పకి మాత్రం రిలీజ్ కష్టాలు తప్పవు.ఎందుకంటే ముందు నుండి ఖాళీగా ఉన్న మే వారానికో పెద్ద సినిమాతో ఫుల్ గా ఉంది.కన్నప్ప జూన్ రిలీజ్ కి వెళ్లాల్సిరావొచ్చు. రాజకీయాల్లో పవర్ ఫుల్ లీడర్ గా సత్తా చాటుతున్న పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ గ్యాప్ ఏ రేంజ్ సంచలనం సృష్టిస్తాడో ఈ సమ్మర్ తేల్చనుంది.