సీబీఐ మాజీ జేడీ వి.వి. లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరి లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో అతను ఓటమి పాలయ్యారు. అనంతరం పార్టీకి రాజీనామా చేశారు. పవన్ కళ్యాణ్ విధానాల్లో నిలకడ లేదని అప్పట్లో తెలిపారు. సమయం రాజకీయాలకే వెచ్చిస్తాను.. ప్రజా సేవకే జీవితం అంకితం అని చెప్పిన పవన్.. మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారనే కారణంతో రాజీనామా చేస్తున్నట్టు ఆయన చెప్పారు. తాజాగా @ Exclusive Podcast with NTV Teluguలో పాల్గొన్న జేడీ లక్ష్మీనారాయణ జనసేనాకు రాజీనామా చేయడానికి గల కారణాన్ని మరోసారి వివరించారు.
READ MORE: Vishwambhara : రామ్ చరణ్ వల్లే విశ్వంభర ఓకే అయిందా.. డైరెక్టర్ క్లారిటీ..
“జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే నినాదంతో 2019 ఎన్నికల్లో పోటీ చేశాం. పవన్ కళ్యాణ్ నాకు సీటు ఇచ్చారు. నేను వైజాగ్ ఎంపీగా బరిలోకి దిగాను. ఆ టైమ్‌లో సుమారుగా 6 % శాతం ఓట్లు సాధించింది జనసేన. కానీ మేము ఎవ్వరూ గెలవలేదు. ఆ తరువాత వారు(పవన్) సినిమాల్లోకి వెళతారని నిర్ణయించారు. సీరియస్‌నెస్ పోతుందేమో అని నేను భావించాను. ఎలాగైనా ఈ పరిస్థితులు మార్చాలని రాజకీయాల్లోకి వచ్చాం. నేను సినిమాలు వదిలేసి వచ్చాను. మీరు ఉద్యోగం వదిలేసి వచ్చారని పవన్ కళ్యాణ్ అనే వారు. కాబట్టి మనమంతా కలిసి చేద్దామని చెప్పేవారు. కానీ.. మళ్లీ సినిమాల వైపునకు మొగ్గు చూపడంతో సీరియస్‌నెస్ తగ్గిపోతుందని నేను భావించాను. అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చాను.” అని వి.వి. లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.
