NTV Telugu Site icon

Pushpa 2: చిరంజీవి ఫాన్స్ vs పుష్ప 2..అసలు నిజమేంటి?

Pushparaj

Pushparaj

అసలే మెగా ఫ్యామిలీకి అల్లు కాంపౌండ్ కి మధ్య దూరం పెరిగింది అనే వార్తలు వింటూనే ఉన్నాం. వాళ్ళు అదేమీ లేదు మేము బాగానే ఉన్నాము. చిన్న చిన్న మనస్పర్ధలు అందరికీ ఉంటాయి కదా అని చెబుతూనే ఉన్న ఈ వార్తలకు మాత్రం బ్రేకులు పడడం లేదు. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి సీనియర్ మెగాస్టార్ అభిమానులు అందరూ పుష్ప 2 సినిమా విషయంలో సీరియస్ గా ఉన్నారని ఆ సినిమా విషయంలో అసలు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అంటూ నిర్ణయం తీసుకున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. అసలు విషయం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం అఖిల భారత చిరంజీవి యువత మీటింగ్ ఒకటి హైదరాబాద్లో జరిగింది.

గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన చర్చలు జరుగుతాయని ముందుగానే పోస్టర్ల ద్వారా ఇంటిమేషన్ ఇచ్చారు. ఇప్పుడు అదే మీటింగ్లో పుష్ప2కి వ్యతిరేకంగా పనిచేయాలని ఆ సినిమాని పట్టించుకోకూడదని అన్ని జిల్లాల ఫ్యాన్స్ అసోసియేషన్లకు సమాచారం అఖిల భారతి చిరంజీవి యువత స్టేట్ బాడీ మీటింగ్ లో ఇచ్చారంటూ ప్రచారం మొదలైంది. ఇదే విషయం మీద సీరియస్ అవుతూ అఖిల భారత చిరంజీవి యువత జనరల్ సెక్రెటరీ, నిర్మాత బాబి ఏడిద స్పందించారు. ఇలాంటి పుకార్లు పుట్టించవద్దని ఆయన కోరారు. మేము గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన సినిమా ఈవెంట్ల గురించి మాత్రమే చర్చించాం. మీరు ఆరోపిస్తున్నట్లుగా మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే షేర్ చేయండి లేదా దయచేసి ట్వీట్ డిలీట్ చేయండి అంటూ పేర్కొన్నారు.

అంతేకాక నిన్న విజయవాడలో పుష్ప కటౌట్ ఏర్పాటు చేసి అక్కడ సెలబ్రేషన్స్ జరిగితే అఖిల భారత చిరంజీవి యువత వైస్ ప్రెసిడెంట్ కృష్ణ ప్రసాద్ కూడా పాల్గొనట్లుగా ఒక ఫోటో షేర్ చేశారు. తమ మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవని, ఆయన ఒక రకమైన స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. నిజానికి ఈ విషయంలో అల్లు అరవింద్ కూడా రంగంలోకి దిగి అఖిలభారత చిరంజీవి యువత ప్రతినిధులతో మాట్లాడుతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ అదేమీ లేదని అసలు పుష్ప 2 గురించి తాము ఎలాంటి కామెంట్లు చేయడం కానీ నిర్ణయం తీసుకోవడం కానీ లేదని అఖిల భారత చిరంజీవి యువత చెబుతోంది. కాబట్టి ఈ మేరకు ప్రచారం అవుతున్నదంతా ఒట్టిదే అని చెప్పొచ్చు. కావాలనే దూరాన్ని మరింత పెంచడానికి ఇలాంటి ప్రచారం చేస్తూ ఉండి ఉండవచ్చని పలువురు కామెంట్ చేస్తున్నారు.

Show comments