అల్లు అరవింద్ కి చెందిన గీత ఆర్ట్స్ సంస్థలో కీలకంగా వ్యవహరించే నిర్మాత బన్నీ వాసు తన పొలిటికల్ జర్నీ గురించి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. తండెల్ సినిమా రిలీజ్ సందర్భంగా ఆయన మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు పొలిటికల్ ఎంట్రీ గురించి ఒక ప్రశ్న ఎదురైంది. 2024 ఎన్నికల్లో కూడా పిఠాపురం లేకపోతే ఏదైనా అసెంబ్లీ స్థానం నుంచి జనసేన తరఫున బన్నీ వాసు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ మీరు ఎందుకో పోటీ చేయలేదు అసలు ఏం జరిగింది అని ప్రశ్న ఎదురయింది. ఈ సందర్భంగా బన్నీ వాసు మాట్లాడుతూ 100% నేను డ్రాప్ అయ్యాను. నాకు మంచి అవకాశం వచ్చింది. కాకపోతే ఏమిటంటే నేను రెండు విధాలు చూసుకోవాలి. ముందుగా నాకు అంత ఆర్థిక బలం ఉందా లేదా అని చూసుకోవాలి.
Bunny Vasu: అల్లు మెగా కుటుంబాల మధ్య బన్నీ వాసు నలిగిపోతున్నాడా?
ఈరోజుల్లో రాజకీయాలు అంత ఈజీ కాదు, ముందు ఆర్థిక బలం సరిపోతుందో లేదో చూడాలి అలాగే నా చుట్టూ ఉన్న బాధ్యతల గురించి కూడా నేను మాట్లాడాలి. నేను రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండాలంటే పోటీ చేయాలంటే అక్కడ పోటీ చేసి ఇక్కడికి వచ్చి కూర్చుంటాను అంటే కుదరదు. కచ్చితంగా నేను అక్కడే ఉండాలి, పోటీ చేసిన దగ్గరే ఉండాలి. అది కాక కళ్యాణ్ గారి లాంటి వ్యక్తితో మనం జర్నీ చేస్తున్నప్పుడు మనం ఇవ్వాల్సిన కమిట్మెంట్ చాలా కచ్చితంగా ఉంటుంది. ఆయన దగ్గర కమిట్మెంట్ లేకుండా పనిచేస్తే ఒకసారి ఆయన పక్కన పెడితే మళ్లీ ఆయనతో కలిసి ట్రావెల్ చేసే అవకాశం ఉండదు. అందుకే నేను నిజంగా ఆ కమిట్మెంట్ ఇవ్వగలిగి ఇక్కడ వారిని వదులుకొని ప్రజా జీవితం లోకి వెళ్లిపోయిన కూడా నా ఫ్యామిలీ నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఫైనాన్షియల్ గా అని అనుకున్నప్పుడు నేను కచ్చితంగా వెళతాను. అంతే తప్పితే నేను ఇక్కడ కూర్చుని అక్కడ రాజకీయం చేయడం ఇలా సగం సగం కరెక్ట్ కాదని నాకు అనిపించి నేనే ఓపెన్ గా ఆగిపోయాను అని అన్నారు.