NTV Telugu Site icon

Allu Arjun: అల్లు అర్జున్ ది కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా?

Allu Arjun

Allu Arjun

పుష్ప అంటే పేరు కాదు.. బ్రాండ్.. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా.. వైల్డ్‌ ఫైర్.. ఈ డైలాగ్స్ బ్లడ్ బాయిల్ చేసేస్తున్నాయి డై హార్ట్ బన్నీ ఫ్యాన్స్‌ను. టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ పుష్ప2కు ఎడిక్ట్ అయ్యేలా చేశాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానోడు కూడా.. ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నారో ఏ లెవల్లో బజ్ నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ హైప్ సినిమా టార్గెట్స్‌ను గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ డే కలెక్షన్స్. ఈ ఏడాదిలో విపరీతమైన అటెన్షన్ క్రియేట్‌ చేసిన ప్రభాస్ కల్కి, తారక్ దేవరలు ఫస్ట్ డే మంచి కలెక్షన్స్ రాబట్టుకున్నాయి. ఈ ఏడాది హయ్యెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచింది దేవర. 175 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇప్పుడు ఈ నంబర్ బీట్ చేయాల్సి ఉంది పుష్ప 2.

Pushpa 2: ఇదేం వాడకం అయ్యా.. మెట్రో రైలెక్కిన పుష్ప రాజ్

అయితే పుష్పరాజ్ హల్చల్ లో పర్సనల్ ఎజెండా ఉందా…? అంటే అవుననే మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. వైల్డ్ ఫైర్ ట్యాగ్స్ ట్రెండింగ్ చేయిస్తుంది కూడా బన్నీ టీం అనే చర్చలు జరుగుతున్నాయి. పుష్ప 2 ప్రమోషన్స్ లో బన్నీ ఆటిట్యూడ్ స్టార్ అయ్యాడా..? అనే అనుమనాలు కలిగించేలా బన్నీ ప్రవర్తన కనిపిస్తోంది. ముందు నుంచి కాస్త దూరంగా ఉంటున్న మెగా ఫ్యాన్స్ ఐకానిక్ స్టార్ కాదు ఆటిట్యూడ్ స్టార్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. నిజానికి బన్నీ ముందు ఉన్న అసలైన టాస్క్ ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే 223 కోట్ల రికార్డును బ్రేక్ చేయడమే. అది ఇప్పటికప్పుడు సాధ్యం కాదు కాబట్టే 12వేల స్క్రీన్స్ రిలీజ్ కు అల్లు కాంపౌండ్ స్కెచ్ వేసింది. అయితే గ్లింప్స్ హిట్ అయితే బొమ్మ హిట్ అవ్వాలని రూల్ ఉందా..? అంటూ మెగా ఫాన్స్ కామెంట్లు చేస్తూ అల్లు కాంపౌండ్ భ్రమల్లో బతికేస్తుందనే మాటలొస్తున్నాయి.

దానికి తోడు బన్నీ సినిమాతో పోటీగా రావాల్సిన సినిమాలు వాయిదా పడడంతో బిటౌన్ హీరోలను భయపెట్టానని బన్నీ ఫీలవుతున్నాడనే వాదన కూడా వినిపిస్తోంది. అయిదు బన్నీ అటాక్…రికార్డులు మీదా…కాంపౌండ్ హీరోల మీదా…? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. దానికి తోడు మొన్నటి టాక్ షోలో స్టేట్మెంట్స్ కొందరు హీరోల ఫాన్స్ కి చిర్రెత్తుకొచ్చేలా చేశాయని కూడా అంటున్నారు. అలాగే బొమ్మ రిలీజయ్యే లోపు మరిన్ని స్టేట్మెంట్స్ కూడా బన్నీ ఇస్తాడని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే అసలు వేయికోట్ల బిజినెస్ పుష్ప -2కు నిజంగానే జరిగిందా..? అనే అనుమానాలు కూడా లేక పోలేదు.

సుకుమార్ బ్లయిండ్ గా జక్కన్నను ఫాలో అయిపోతున్నాడని కొందరు అంటుండగా లేదు లేదు మైత్రి ప్రొడక్షన్లో అల్లువారి పెత్తనం మరీ పెరిగిపోయిందని మరో వర్గం అంటోంది. అయితే ఆ సంగతి పక్కన పెడితే పుష్ప 2 క్రెడిట్ దర్శకుడి కంటే హీరోకే ఎక్కువగా వెళ్తోంది మరి రేపు రిజల్ట్ ఏదైనా ఐకానిక్ స్టారే బాధ్యతలు తీసుకుంటాడా..? అంటే అనుమానమే. దర్శకుడు సుకుమార్ టెన్షన్ ..సాలిడ్ అవుట్ పుట్ కోసమే అయినా బన్నీ వైఖరి సినిమా రిజల్ట్ పై ఎంతవరకు ఉండవచ్చని కూడా లెక్కలు వేస్తున్నారు.

మెగా హీరోలెవరు పుష్ప 2పై రియాక్ట్ కావడం లేదు…? అంటే రిలీజ్ అయ్యాక మాట్లాడతారా? అనే అనుమానాలు ఉన్న క్రమ్మలో ఫస్ట్ డే అల్లు కాంపౌండ్ ప్లాన్ బి స్కెచ్ తో రెడీగా ఉందనే టాక్ కూడా ఉంది. పుష్ప-2పై మరోసారి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఏమైనా ఇస్తాడా…?, పుష్ప-2పై మరోసారి పవన్ ఇన్ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తాడా…? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. పుష్ప 2 మ్యాటర్లో బన్నీది కాన్ఫిడెన్సా..ఓవర్ కాన్ఫిడెన్సా .? అనే చర్చలు సాగుతున్నా మైత్రి మేకర్స్ కు అసలు ధైర్యం సుకుమార్ మాత్రమేనని అంటున్నారు. అయితే పుష్ప 2 సినిమాకి 1500-2000 కోట్లను కొల్లగొట్టడం అన్నికంటే పెద్ద టాస్క్. అడ్వాన్స్ బుకింగ్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ డిసైడ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. టికెట్ రేట్, ఆక్యుపెన్సీ ఓపెనింగ్స్.. వసూళ్లపై ఎఫెక్ట్ చూపిస్తాయి. మరీ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజౌతున్న పుష్ప 2 ఏ హిస్టరీకల్ రికార్డును సృష్టిస్తుందో చూడాలి.