NTV Telugu Site icon

Allu Aravind: మరింత గ్యాప్ పెంచుతున్న అల్లు అరవింద్?

allu aravind

allu aravind

స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు రామలింగయ్య కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన నటుడిగా ఒకటి రెండు సినిమాల్లో కనిపించినా, ఎక్కువగా నిర్మాతగా ఉండడానికి ఇష్టపడ్డారు. ఒకరకంగా మెగాస్టార్ చిరంజీవికి సూపర్ హిట్లు అందించడంలో ఆయనది అందె వేసిన చేయి అనే ప్రచారం కూడా ఉంది. దానికి తోడు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ కాంబినేషన్ కూడా చాలాసార్లు బ్లాక్ బస్టర్ హిట్లకు కారణమయింది. అయితే అదంతా ఒకప్పటి సంగతి. తర్వాతి కాలంలో మెగాస్టార్ చిరంజీవి వారసుడు రామ్ చరణ్ తేజ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగాడు. అల్లు అరవింద్ వారసుడిగా అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చి ఐకాన్ స్టార్ గా నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ సినిమా ప్రమోషన్స్ లో అల్లు అరవింద్ రామ్ చరణ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తండేల్ సినిమా తమిళంలో కూడా రిలీజ్ అవుతుంది. ఒక తమిళ ఛానల్ ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ మాట్లాడుతూ నిజానికి చిరుత అంటే రామ్ చరణ్ డెబ్యూ మూవీ యావరేజ్ అని తాను రాజమౌళితో మాట్లాడి ఆయనకు మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ కి కారణమయ్యానని కామెంట్ చేశాడు. ఇదే ఇప్పుడు మెగా అభిమానులకు కోపం తెప్పిస్తోంది.

UP: రైతుకు సమీపంగా వచ్చిన పులి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

ఎందుకంటే చిరుత 2007లో రిలీజ్ అయితే దాదాపు పాతిక కోట్ల రూపాయల కలెక్ట్ చేసింది. మిగతా స్టార్ హీరోలు మొదటి సినిమాలతో పోలిస్తే ఇది ఎక్కువ కలెక్షన్స్ అనే చెప్పాలి. అలాగే అదే ఏడాది అదే దర్శకుడు అల్లు అర్జున్ తో చేసిన దేశముదురు సినిమా కూడా చిరుత కంటే తక్కువ కలెక్షన్స్ రాబట్టింది. అల్లు అరవింద్ చెబుతున్నట్టు మగధీర బ్లాక్ బస్టర్ హిట్, ఇండస్ట్రీ హిట్. కానీ చిరుత మాత్రం యావరేజ్ సినిమా కానే కాదు అంటూ మెగా అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక సినిమా ఈవెంట్లో గేమ్ చేంజర్ గురించి చురకలు వేశారు అల్లు అరవింద్. ఇప్పుడు రామ్ చరణ్ మొదటి సినిమా యావరేజ్ అంటూ కామెంట్ చేశారు. మామూలుగానే అల్లు కాంపౌండ్ మెగా కాంపౌండ్ మధ్య దూరం పెరిగిందని చాలా రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ దూరాన్ని మరింత పెంచేలా అల్లు అరవింద్ కామెంట్స్ ఉండడం ఇప్పుడు ఇరు వర్గాలను అభిమానించే ముచ్యువల్ ఫ్యాన్స్ కి కాస్త తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. దీని మీద స్వయంగా అల్లు అరవింద్ స్పందించి క్లారిటీ ఇస్తే తప్ప ఈ అపార్ధాలు ఇప్పట్లో సమసి పోయే పరిస్థితి కనిపించడం లేదు. మరి చూడాలి అల్లు అరవింద్ ఏం చేస్తారో.