NTV Telugu Site icon

Virat Kohli: సీల్ తీయని మొబైల్ పోయిందని కోహ్లీ ట్వీట్..జొమాటో రిప్లై అదుర్స్

V

V

ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం సిద్ధమవుతున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా మంగళవారం కోహ్లీ ఓ ట్వీట్ చేశాడు. తన కొత్త మొబైల్‌ను పోగొట్టుకున్నానంటూ పోస్ట్ పెట్టాడు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌ అయ్యింది. ‘కొత్త ఫోన్‌ను కనీసం అన్‌బాక్స్ చేయకుండానే పోగొట్టుకోవడం కంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదు. మీరు ఎవరైనా ఆ ఫోన్‌ను చూశారా? ‘అని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. కోహ్లీ ఫోన్ పోయిందనే ఈ ట్వీట్ క్షణాల్లో వైరలవ్వగా.. అతని అభిమానులు ఓదార్చే ప్రయత్నం చేశారు. మరికొందరు మాత్రం తమ ఫన్నీ ట్వీట్లతో నవ్వులు పూయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఇచ్చిన రిప్లై అందరినీ ఆకట్టుకుంటోంది.

Also Read: Virat Kohli: అరుదైన రికార్డు ముంగిట కోహ్లీ..మరో 64 రన్స్ చేస్తే!

‘వదిన ఫోన్ నుంచి ఐస్‌క్రీమ్ ఆర్డర్ ఇచ్చేందుకు ఏమాత్రం సందేహించొద్దు. అది కచ్చితంగా మీకు సహాయ పడుతుంది’అని జొమాటో రిప్లై ఇచ్చింది. ఈ ట్వీట్‌‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఫ్రీగా తమ బిజినెస్‌ను అడ్వైజ్ చేసుకుంటుందని కొందరు ఫ్యాన్స్ కామెంట్ చేయగా.. మరికొందరు మాత్రం జొమాటోలో ఆర్డర్ చేయడం కంటే ఐస్‌క్రీమ్ తినకుండా ఉండటం మేలని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి కోహ్లీ మొబైల్ ఫోన్ పోవడం ఏమో కానీ జొమాటో వార్తల్లో నిలిచింది.

ప్రమోషన్‌లో భాగమేనా..

విరాట్ కోహ్లీ తన ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఆ ఫోన్‌ను కొనుగోలు చేయగా.. ఆ మొబైల్‌ను కనీసం ఓపెన్ చేయకుండానే పోయినట్లు నెటిజన్లు అంచనా వేస్తున్నారు. మరికొందరు మాత్రం ఏ మొబైల్ కోసం ఈ పెయిడ్ ట్వీట్ అని విరాట్ ప్రశ్నిస్తున్నారు. వివో ఫోన్ ప్రమోషన్స్‌లో భాగంగానే ఈ ట్వీట్ చేశాడని కామెంట్ చేస్తున్నారు. అయితే విరాట్ తన ట్వీట్‌లో ఎలాంటి బ్రాండ్స్ మెన్షన్ చేయలేదని, నిజంగానే అతని మొబైల్ పోయినట్లుందని మరికొందరు అంటున్నారు.

Also Read: Prabhas: బిగ్ బ్రేకింగ్.. ప్రభాస్ కు అస్వస్థత..?