Zomato Large Order Fleet: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు ఆఫర్స్, కొత్త సదుపాయాలని అందిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు అనేక కొత్త ఫీచర్లను అందించగా.. అందులో జొమాటో “లార్జ్ ఆర్డర్ ఫ్లీట్” ఫిచర్ గురించి మీకేమైనా తెలుసా..? ఏంటి తెలియదా.. ఏం పర్వాలేదు. జొమోటో అందిస్తున్న ఈ సర్వీస్ గురించి ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాము.
Also Read: Vikatakavi: 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకుపోతున్న ‘వికటకవి’ సిరీస్
జొమాటో అందిస్తున్న “లార్జ్ ఆర్డర్ ఫ్లీట్” సదుపాయంతో పెద్ద ఆర్డర్లు చేసిన సమయంలో వాటి డెలివరీ చేయడం చాలా సులభం చేసేందుకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకవచ్చారు. ఈ లార్జ్ ఆర్డర్ ఫ్లీట్ సహాయంతో.. ఒకేసారి 50 మందికి ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. దీనితో జొమాటో పార్టీలు, ఈవెంట్‌ల వంటి సెగ్మెంట్లలో డెలివరీ చేసే అవకాశాన్ని కూడా పొందుతుంది. జోమాటో సీఈవో దీపిందర్ గోయల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ సేవను ప్రారంభించినట్లు కొద్దీ రోజుల క్రితమే ప్రకటించారు. దేశంలోనే మొట్టమొదటి లార్జ్ ఆర్డర్ ఫ్లీట్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, ఇది మీరు పార్టీలు ఇంకా ఈవెంట్‌లను నిర్వహించడాన్ని సులభతరం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఫ్లీట్ లోని అన్ని వాహనాలు ఎలక్ట్రిక్‌తో పని చేస్తాయి. ఇవి ఒకేసారి 50 మందికి ఆహారాన్ని తీసుకెళ్లగలవు.
Also Read: INDIA bloc: ఇండియా కూటమి చీఫ్‌గా మమతా బెనర్జీ.. “గుడ్ జోక్” అంటూ కాంగ్రెస్ ఎద్దేవా..
ఇక ఈ ఎలక్ట్రిక్ డెలివరీ వాహనాలకు కూలింగ్ కంపార్ట్‌మెంట్లు, ఇంకా హాట్ బాక్స్‌ల వంటి మరిన్ని ఫిచర్లను జోడించే ప్రక్రియలో కంపెనీ ఉంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలు ఒకే ఛార్జ్‌తో 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు. డెలివరీ వేగంగా, మరింత ప్రభావవంతంగా జరిగేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయి. ఇవి డెలివరీ ప్రక్రియను మరింత త్వరిగతన చేస్తుంది. కొత్త ఫీచర్‌లను అందించడానికి, ఇంకా కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి జొమాటో ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే ఈ “లార్జ్ ఆర్డర్ ఫ్లీట్” ఆహార ప్రియుల కోసం తీసుక వచ్చారు.