న్యూ ఇయర్ వేళ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు ఫుడ్ లవర్స్ కు బిగ్ షాకిచ్చాయి. ఇదే సమయంలో డెలివరీ బాయ్స్ కు మాత్రం గుడ్ న్యూస్ అందించాయి. నివేదికల ప్రకారం, నూతన సంవత్సరం సందర్భంగా డెలివరీలలో అంతరాయాలు ఏర్పడతాయనే భయాల మధ్య, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు జొమాటో, స్విగ్గీ కీలక ప్రకటన చేశాయి. అవును, రెండు కంపెనీలు ఇప్పుడు గిగ్ కార్మికులకు ఎక్కువ చెల్లింపులను అందించేందుకు రెడీ అయ్యాయి. నివేదికల ప్రకారం, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు జొమాటో, స్విగ్గీ ఇప్పుడు తమ డెలివరీ పార్ట్ నర్స్ కు అధిక ప్రోత్సాహకాలను అందించనున్నాయి.
Also Read:10,080mAh భారీ బ్యాటరీ, MediaTek Dimensity 8500 Elite ప్రాసెసర్‌తో జనవరి 5న HONOR Power2 లాంచ్..!
మెరుగైన వేతనం, మెరుగైన పని పరిస్థితులను డిమాండ్ చేస్తూ లక్షలాది మంది కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొనబోతున్నారని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ (IFAT) పేర్కొనడం గమనార్హం. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య రద్దీ సమయాల్లో జొమాటో డెలివరీ పార్ట్ నర్స్ కి ఆర్డర్‌కు రూ.120 నుండి రూ.150 వరకు చెల్లింపును ఆఫర్ చేసింది.
ఈ ఆకస్మిక చర్య గురించి తెలిసిన వర్గాలు, ఆర్డర్‌ల సంఖ్య, కార్మికుల లభ్యతను బట్టి రోజుకు రూ.3,000 వరకు ఆదాయాన్ని కూడా ప్లాట్‌ఫామ్ హామీ ఇచ్చిందని తెలిపారు. అదనంగా, ఆర్డర్ తిరస్కరణ, రద్దు కోసం జొమాటో తాత్కాలికంగా జరిమానాలను మాఫీ చేసింది. జొమాటో మాతృ సంస్థ ఎటర్నల్ ప్రతినిధి పిటిఐ నివేదికలో ఇది అధిక డిమాండ్ ఉన్న పండుగలు, ఇయర్ ఎండ్ లో అనుసరించే ప్రామాణిక ఆపరేటింగ్ ప్రోటోకాల్ అని వివరించారు.
Also Read:CP Sajjanar: తాగి బండి నడిపారో.. వెళ్లేది ఇంటికి కాదు.. నేరుగా చంచల్‌గూడ జైలుకే..!
జొమాటో మాదిరిగానే, స్విగ్గీ కూడా సంవత్సరాంతానికి ప్రోత్సాహకాలను పెంచింది. డిసెంబర్ 31, జనవరి 1 మధ్య డెలివరీ కార్మికులకు రూ.10,000 వరకు ఆఫర్ చేస్తున్నట్లు నివేదికలు తెలిపాయి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా, అత్యంత రద్దీగా ఉండే ఆర్డర్ సమయాల్లో తగినంత మంది రైడర్లు అందుబాటులో ఉన్నారని నిర్ధారించుకోవడానికి, సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల మధ్య ఆరు గంటల వ్యవధిలో ప్లాట్‌ఫామ్ రూ. 2,000 వరకు పీక్-అవర్ ఆదాయాన్ని అందించనున్నట్లు తెలిపారు.
