ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ ‘జొమాటో’ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. దీపావళి పండగ వేళ ప్లాట్‌ఫామ్ ఫీజును జొమాటో పెంచింది. ఇక నుంచి ప్రతి ఆర్డర్‌పై రూ.10 వసూలు చేయనుంది. ఇంతకుముందు ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.7గా ఉంది. పండుగ రద్దీ సమయంలో సేవలను విజయవంతంగా కొనసాగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని జొమాటో తన యాప్లో పేర్కొంది. పెరిగిన ప్లాట్‌ఫామ్ ఫీజుతో కస్టమర్లు కంగుతింటున్నారు.
జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచడం ఇదే మొదటిసారి మాత్రం కాదు. జొమాటో కంపెనీని లాభంలోకి తీసుకొచ్చేందుకు మొదటిసారిగా 2023 ఆగస్టులో ప్లాట్‌ఫామ్ ఫీజును ప్రవేశపెట్టింది. ఒక ఆర్డర్‌కు రూ.2 చొప్పున వసూలు చేసేది. ఆపై రూ.3, రూ.4, రూ.7కి పెరిగింది. తాజాగా ఈ ఫీజు రూ.10కి చేరింది. రోజుకు జొమాటో 2- 2.5 మిలియన్ల పుడ్ ఆర్డర్లను డెలివరీ చేస్తుందట. ఈ ప్లాట్‌ఫామ్ ఫీ పెంపుతో కంపెనీ భారీగా లాభం పొందనుంది.
Also Read: IND vs NZ: జట్టును సోషల్ మీడియా ఎంపిక చేయదు.. గంభీర్ కీలక వ్యాఖ్యలు!
ప్లాట్‌ఫామ్ ఫీజు అనేది జీఎస్టీ, రెస్టారెంట్ ఛార్జీలు, డెలివరీ రుసుములకు అదనంగా వసూలు చేస్తున్నాయి. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.10 పైన కూడా మనం 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో ఆర్డర్‌పై ప్లాట్‌ఫాం ఫీజు రూపంలో రూ.11.80 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. జొమాటో ప్రత్యర్థి స్విగ్గీ కూడా ప్లాట్‌ఫామ్ ఫీజును తక్కువతోనే ప్రారంభించినా.. ఇప్పుడు దానిని రూ.7కు పెంచింది. ఇప్పుడు జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచడంతో స్విగ్గీ కూడా పెంచే అవకాశం ఉంది.