Site icon NTV Telugu

Food Delivery: హైదరాబాద్ లో పెట్రోల్ కొరత.. గుర్రంపై ఫుడ్ డెలివరీ

Food Delivery

Food Delivery

భారతదేశ వ్యాప్తంగా హిట్ అండ్ రన్ యాక్ట్ వల్ల ట్రక్, ట్యాంకర్లు చేపట్టిన ధర్నా కారణంగా నగరంలో భారీగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పాడింది. దీంతో ఈ ప్రభావం ఫుడ్ డెలివరీ చేసే బాయ్స్ పై పడింది. ఫుడ్ డెలివరీ బాయ్ దాదాపు మూడు గంటల పాటు పెట్రోల్ బంక్ దగ్గర క్యూ లైన్ లో వేచి ఉన్నాడు. ఈ క్రమంలో ఆ యువకుడికి పెట్రోల్ దొరకకపోవడంతో విసుగు చెంది.. ఓ గుర్రం తీసుకుని దానిపై ఫుడ్ ఆర్డర్ లను డెలివరీ చేశాడు. అయితే, ఈ ఘటన మన హైదరాబాద్ లోని చంచల్ గూడలో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ ఏకంగా గుర్రం మీద స్వారీ చేస్తూ.. ఫుడ్ ఆర్డర్ ను డెలివరీ చేయడానికి వెళ్తున్నప్పుడు నెటిజన్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Read Also: Mark Zuckerberg: భూగర్భ బంకర్‌ను మార్క్ జుకర్‌బర్గ్.. 270 మిలియన్ డాలర్లు ఖర్చు

దీంతో ఆ వీడియో కాస్తా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఏం ఐడియా గురు అంటూ ఆ ఫుడ్ డెలివరీ బాయ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే మరో పక్క ఎలక్ట్రిక్ వెహికిల్ కొనుగోలు చేసిన డెలివరి బాయ్స్ మాత్రం ఏం చక్కా ఫుడ్ ను డెలివరీ చేసేందుకు పరుగులు తీశారు. కాగా రాత్రి కేంద్ర ప్రభుత్వం డ్రైవర్ల అసోసియేషన్ తో జరిపిన చర్చలు సక్సెస్ కావడంతో డ్రైవర్లు నిరసనను విరమించుకుని ట్యాంకర్లతో ఆయిల్ కంపెనీలకు చేరుకుంటున్నాయి. ఈరోజు తెల్లవారుజాము కల్లా హైదరాబాద్ నగరంలోని అన్ని పెట్రోల్ బంకులకు ట్యాంకర్లు ఫుల్ లోడ్ తో చేరుకున్నాయి. దీంతో రాత్రితో పోల్చుకుంటే.. పెట్రోల్ బంకుల దగ్గర ప్రస్తుత పరిస్థితులు నిలకడగా ఉన్నాయి.
https://twitter.com/HassanSiddiqei/status/1742265630496301284

Exit mobile version