Site icon NTV Telugu

Zimbabwe Celebrations: జింబాబ్వే దెబ్బకు ఆసీస్ అబ్బా! సెలబ్రేషన్ మాములుగా లావుగా.. వీడియో వైరల్

Zimbabwe Celebrations

Zimbabwe Celebrations

Zimbabwe Celebrations: జింబాబ్వే క్రికెట్ జట్టు ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో సూపర్ 8 దశకు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంపై జట్టు కెప్టెన్ సికందర్ రాజా తాజాగా స్పందించాడు. ఈ విజయం పట్ల తాను ఎంతో వినమ్రంగా, కృతజ్ఞతతో ఉన్నానని చెప్పుకొచ్చారు. మా జట్టు లక్ష్యం కేవలం సూపర్ 8కు చేరుకోవడం మాత్రమే కాదని.. ప్రపంచ వేదికపై జింబాబ్వేకు మరింత గుర్తింపు, గౌరవం తీసుకురావడమే ప్రధాన ఉద్దేశమని అన్నాడు.

PAK Playing XI vs NAM: నమీబియాతో మ్యాచ్‌.. పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్‌పై హై డ్రామా!

ఓమాన్‌పై విజయం, 2021 చాంపియన్ ఆస్ట్రేలియాపై అద్భుత ప్రదర్శన, అలాగే ఐర్లాండ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడం వంటి ఫలితాల నేపథ్యంలో జింబాబ్వే మొదటిసారి సూపర్ 8 దశకు చేరింది. దీనితో గ్రూప్ Bలో ఐర్లాండ్, ఆస్ట్రేలియా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాయి. ఇకపోతే 2007 నుంచి 2016 వరకు ప్రతి టి20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశలోనే జింబాబ్వే నిష్క్రమించింది. 2021, 2024 ఎడిషన్లకు అర్హత సాధించలేకపోయింది. 2022లో సూపర్ 12 దశకు చేరినా, 12వ స్థానంతో ముగించింది. 1999 వన్డే ప్రపంచకప్‌లో ఐదో స్థానం జింబాబ్వేకు ఇప్పటివరకు ఉన్న ఉత్తమ ఫలితం.

శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలో అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావడం తమకు అదనపు ఉత్సాహాన్నిచ్చిందని కెప్టెన్ రజా పేర్కొన్నారు. జింబాబ్వే క్రికెట్‌పై ప్రజలకు మళ్లీ నమ్మకం కలిగింది. మా ఆటతీరు వాళ్లలో ఆశను నింపిందని అన్నారు. అభిమానులు, మీడియా, దేశ ప్రజలందరూ ఒకటిగా నిలిస్తే జింబాబ్వే మరింత విజయాలు సాధించగలదని విశ్వాసం వ్యక్తం చేసాడు. సూపర్ ఎయిట్‌కు అర్హత సాధించడం ఒక ‘టిక్క్ ఇన్ ది బాక్స్’ మాత్రమేనని.. కానీ పూర్తి లక్ష్యం ఇంకా ముందుందని రజా స్పష్టం చేశారు.

Amazon Logo Mehndi: అమెజాన్ లో చిగురించిన ప్రేమ.. పెళ్లిలో చేతిపై ఐకానిక్ స్మైల్ లోగోతో వధువు

ఇక ఐర్లాండ్ తో జరగాల్సిన వర్షం కారణంగా ఆట రద్దవడంతో జింబాబ్వే అభిమానులు పాటలు పాడుతూ సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ సంబరాల్లో కేవలం అభిమానులే కాదు.. జట్టు ఆటగాళ్లు కూడా పాడుతూ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కెప్టెన్ రాజాతో పాటు ఆటగాళ్లు, సిబ్బంది, అభిమానులు కూడా పాటలు పాడుతూ వారి ఆనందాన్ని పంచుకున్నారు.

Exit mobile version