Site icon NTV Telugu

Zimbabwe vs Sri Lanka: శ్రీలంక గడ్డపై జింబాబ్వే సంచలనం విజయం.. టేబుల్ టాపర్‌గా రజా సేన

Zimbabwe

Zimbabwe

Zimbabwe vs Sri Lanka: టీ20 ప్రపంచకప్ 2026లో జింబాబ్వే అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. టోర్నీలో పెద్ద జట్లను కుదిపేయాలని కెప్టెన్ సికందర్ రజా ఇప్పటికే కంకణం కట్టుకున్నాడు. తాజాగా శ్రీలంక జట్టును ఆ దేశ ఓన్ గ్రౌండ్‌లోనే ఓడించింది. ఈ గ్రాండ్ విక్టరీతో సూపర్-8కు ముందే గ్రూప్–బీలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా లాంటి భారీ టీమ్‌ను ఓడించి సూపర్-8లోకి అర్హత సాధించిన జింబాబ్వే.. తాజాగా శ్రీలంకను సైతం ఓడించి గ్రూప్ టాపర్‌గా నిలిచింది. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లో జింబాబ్వే స్థానం చాలా తక్కువ. కానీ ఎనిమిదో స్థానంలో ఉన్న శ్రీలంకను ఓడించడం పెద్ద అప్‌సెట్‌గా మారింది. గత ఏడాది కూడా జింబాబ్వే శ్రీలంకపై రెండు సార్లు గెలిచింది. 2024లోనూ ఒకసారిఓడించింది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన పన్నెండు మ్యాచ్‌లలో శ్రీలంక ఎనిమిది గెలిచినా, జింబాబ్వే నాలుగు విజయాలతో తమ పోరాటస్ఫూర్తిని చూపించింది. కొలంబో ఆర్‌పీఎస్ మైదానం మాత్రం శ్రీలంకకు అదృష్టం కలిగించలేకపోతోంది. అక్కడ ఆడిన 34 మ్యాచ్‌లలో కేవలం తొమ్మిది విజయాలే రావడం బలహీనతను బయటపెట్టింది.

READ MORE: Amazon Deal: అమెజాన్ లో హాట్ డీల్.. Haier 190L ఫ్రిజ్ పై 31% డిస్కౌంట్..

ఈ మ్యాచ్‌లో శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసి మంచి ఆరంభం చేసింది. పాతుమ్ నిస్సంక అద్భుతంగా ఆడి 41 బంతుల్లో 62 పరుగులు చేశాడు. చివరి ఓవర్లలో పావన్ రత్నాయకే వేగంగా 25 బంతుల్లో 44 పరుగులు చేసి జట్టును 178 పరుగుల బలమైన స్కోరుకు చేర్చాడు. జింబాబ్వే బౌలర్లలో గ్రేమ్ క్రీమర్, బ్లెసింగ్ ముజరబాని, బ్రాడ్ ఇవాన్స్ ఇద్దేసి వికెట్లు తీసి పరుగులు అదుపులో పెట్టారు. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే బ్యాటింగ్ చాలా పద్ధతిగా సాగింది. బ్రియాన్ బెన్నెట్ మరోసారి అద్భుతంగా ఆడి 63 పరుగులతో జట్టుకు పునాది వేశాడు. ఈ ప్రపంచకప్‌లో వరుసగా మూడో అర్ధశతకం ఇది. ఓమాన్‌పై 48 నాటౌట్, ఆస్ట్రేలియాపై 64 నాటౌట్‌గా నిలిచి శ్రీలంకపై అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ సికందర్ రజా 45 పరుగులతో మ్యాచ్‌ను జింబాబ్వే వైపు తిప్పేశాడు. చివరకు 19.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. ఈ విజయంతో తమ గ్రూపులో అగ్రస్థానాన్ని సంపాదించారు.

READ MORE: Naa Anveshana Shock: యూట్యూబర్ అన్వేష్ ఇన్‌స్టా అకౌంట్ బ్యాన్.. 1.3 మిలియన్ ఫాలోవర్స్ పోయారు..

Exit mobile version