NTV Telugu Site icon

West Bengal: బెంగాల్ గవర్నర్‌ సీవీ ఆనంద్ బోస్పై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు..

Bengal

Bengal

West Bengal: పశ్చిమ బెంగాల్ గవర్నర్‌పై డ్యాన్సర్ లైంగిక వేధింపుల ఫిర్యాదు మేరకు కోల్‌కతా పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 376, 120బి కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌లో సీవీ ఆనంద్ బోస్ మేనల్లుడి పేరు కూడా ఉంది. ఈ ఎఫ్‌ఐఆర్ హేర్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో నమోదు అయింది. సాధారణంగా సంఘటన జరిగిన చోట మాత్రమే పోలీసులకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవచ్చు.. అయితే జీరో ఎఫ్ఐఆర్ నమోదైతే కేసు నమోదు చేసే పోలీసులు ఎక్కడైనా ఘటనపై దర్యాప్తు చేసే అవకాశం ఉంది.

Read Also: Astrology: జూన్ 17, సోమవారం దినఫలాలు

కాగా, ఫిర్యాదు అందిన ప్రకారం, జూన్ 2023 లో, గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ఒక కార్యక్రమం పేరుతో ఒడిశా నుంచి ఢిల్లీకి ఒక ప్రముఖ డ్యాన్సర్‌ను తీసుకెళ్లాడు.. అక్కడ ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో డ్యాన్సర్ కు బస ఏర్పాటు చేశారు. అక్కడే బెంగాల్ గవర్నర్ తనను లైంగికంగా వేధించారని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత డ్యాన్సర్ ఫిర్యాదుతో రాష్ట్ర సచివాలయం నవన్‌ను ఆశ్రయించింది. నవన్ తర్వాత ఈ విషయంపై ప్రాథమిక విచారణ జరపాలని కోల్‌కతా పోలీసులను ఆదేశాలు జారీ చేశారు. పోలీసు హెడ్‌క్వార్టర్స్ లాల్‌బజార్ ప్రాథమిక విచారణ జరిపి రాష్ట్ర సచివాలయానికి విచారణ నివేదికను సమర్పించింది. ఇక, ఇటీవల రాజ్‌ భవన్‌లోని తన ఛాంబర్‌లో మహిళా ఉద్యోగినిపై గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో గవర్నర్‌ కార్యదర్శితో పాటు రాజ్‌భవన్‌లోని ఇతర ఉద్యోగులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.