Fastest Charging Battery in 2025 Zeekr 007: ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే బ్యాటరీని చైనాకు చెందిన కార్ల తయారీ కంపెనీ ‘జీక్ర్’ అభివృద్ధి చేసింది. మంగళవారం జరిగిన ఎవల్యూషన్ న్యూ జనరేషన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జీక్ర్ తన 2025 మోడల్ ఇయర్ వెర్షన్ 007ని విడుదల చేసింది. వచ్చేవారం నుంచి ఈ కార్లు అందుబాటులోకి రానున్నాయి. 2025 జీక్ర్ 007లో ఈ సరికొత్త బ్యాటరీని అమర్చినట్లు కంపెనీ పేర్కొంది. ఈ బ్యాటరీ 10 నుంచి 80 శాతం ఛార్జింగ్‌కు కేవలం పదిన్నర నిమిషాల సమయం మాత్రమే తీసుకొంటాయని జీక్ర్ తెలిపింది.
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ‘టెస్లా’ కంటే తమ బ్యాటరీలు వేగంగా ఛార్జ్ అవుతాయని జీక్ర్ ప్రకటించింది. గత బ్యాటరీల కంటే 4.5 నిమిషాల తక్కువ సమయం తీసుకుంటుంది. మైనస్ 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలోనూ తమ బ్యాటరీలు అదే విధంగా పనిచేస్తాయని పేర్కొంది. జీక్ర్ 007 సెడాన్ రెండు వేర్వేరు బ్యాటరీలతో వస్తుంది. 75 kWh గోల్డెన్ బ్యాటరీ, 100 kWh CATL క్విలిన్ బ్యాటరీలు అందుబాటులో ఉన్నాయి. టెస్లాకు చెందిన మోడల్ 3లో వాడే బ్యాటరీలకు 15 నిమిషాల సమయం పడుతుంది. ఒక ఛార్జ్‌పై 688 కిమీ నుంచి 870 కిమీల మధ్య ప్రయాణం చేయొచ్చని కంపెనీ అంటోంది.
Also Read: Saina Nehwal: కామెంట్లు చేయడం ఈజీ.. గేమ్స్ ఆడటం చాలా కష్టం! ఇచ్చిపడేసిన సైనా
చైనా కార్ల తయారీ దిగ్గజం ‘గీలీ’కి చెందిన సంస్థే జీక్ర్. యూకేకు చెందిన లోటస్, స్వీడన్‌కు చెందిన వోల్వో కూడా ఈ గ్రూపుకు చెందినవే. ప్రస్తుతం జీక్ర్‌కు చైనాలో 500 అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఏడాది చివరి నాటికి రెట్టింపు చేయాలని కంపనాయ్ భావిస్తోంది. 2026 నాటికి 10,000 స్టేషన్లు ఉండేలా చర్యలు ప్రణాళికలు రచించింది.