NTV Telugu Site icon

Zebra OTT: ఓటీటీలోకి సత్యదేవ్‌ ‘జీబ్రా’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Zebra Review

Zebra Review

సత్యదేవ్‌, డాలీ ధనంజయ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జీబ్రా: లక్‌ ఫేవర్స్‌ ది బ్రేవ్‌’. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎస్‌ఎన్‌ రెడ్డి, బాల సుందరం, ఎస్‌ పద్మజ, దినేశ్‌ సుందరం సంయుక్తంగా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్‌, జెన్నిఫర్‌ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో సునీల్, సత్యరాజ్ కీలకపాత్రలు చేశారు. క్రైమ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన జీబ్రా.. నవంబర్‌ 22న రిలీజ్‌ అయి బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ తెచ్చుకుంది.

Also Read: MS Dhoni: ఎంఎస్ ధోనీ లాంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదు: ఐపీఎల్ యజమాని

జీబ్రా సినిమా ఓటీటీలో విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘ఆహా’లో స్ట్రీమింగ్‌కు రానుంది. ఈమేరకు తెలుగు ఓటీటీ ఆహా అధికారికంగా ప్రకటించింది. అయితే అధికారికంగా స్ట్రీమింగ్‌ తేదీ ఎప్పుడు అనేది మాత్రం ఆహా ప్రకటించలేదు. ‘కమింగ్ సూన్ ఆన్ ఆహా’ అంటూ ఒక పోస్టర్‌ను మాత్రమే రిలీజ్‌ చేసింది. డిసెంబర్‌ 14న స్ట్రీమింగ్‌కు రానున్నట్లు తెలుస్తోంది. థియేటర్లో చూడని వారు ఈ వారాంతంలో ఎంచక్కా ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు.

Show comments