NTV Telugu Site icon

Y. V. S. Chowdary : మరోసారి మెగా ఫోన్ పట్టనున్న వై వి ఎస్ చౌదరి..?

Whatsapp Image 2023 10 09 At 9.27.56 Pm

Whatsapp Image 2023 10 09 At 9.27.56 Pm

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్ల లో వైవిఎస్ చౌదరి ఒకరు ఈయన అప్పట్లో తీసిన లాహిరి లాహిరి లాహిరి లో, సీతయ్య లాంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయి ఆయనకు మంచి పేరు తీసుకువచ్చాయి. ఆ తర్వాత ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని ని లాంటి యంగ్ హీరోని ఇండస్ట్రీ కి పరిచయం చేస్తూ ఆయన చేసిన దేవదాస్ సినిమా కూడా ఇండస్ట్రీ లో మంచి విజయాన్ని అందుకుంది. ఆయన బాలయ్య తో తీసిన ఒక్క మగాడు సినిమా మాత్రం భారీ డిజాస్టర్ ని అందుకుంది. ఇక ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేస్తూ ఆయన ప్రొడ్యూసర్ గా చేస్తునే డైరెక్షన్ కూడా చేసిన రేయ్ సినిమా భారీ ఫ్లాప్ అవడంతో ఇండస్ట్రీ కి దూరం అయ్యారు.ప్రస్తుతం ఆయన ఒక మంచి కథని రెడీ చేసే పనిలో ఉన్నట్టు గా తెలుస్తుంది.

2024 వ సంవత్సరంలో ఆయన మళ్లీ మెగా ఫోన్ పట్టబోతున్నట్టు గా సమాచారం.. ఇక ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఆయన నందమూరి కళ్యాణ్ రామ్ తో ఒక సినిమా కూడా చేయబోతున్నట్టు గా వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే ఆ కథకు సంబంధించిన పనుల్లో వైవిఎస్ చౌదరి బిజీ గా ఉంటున్నట్టు గా సమాచారం.ఒకవేళ ఈ సినిమా కనక పట్టాలు ఎక్కితే కళ్యాణ్ రామ్ కి ఈ దర్శకుడు ఎలాంటి విజయం అందిస్తాడో చూడాలి.ఇక వై వి ఎస్ చౌదరి ఒక మంచి డైరెక్టర్ ఎమోషన్స్ ని బాగా హ్యాండిల్ చేయగలిగే డైరెక్టర్ ఆయన ఇంతకు ముందు తీసిన సినిమాలు మంచి ప్రేక్షకాదరణ లభించాయి..ఆయన కెరియర్ లో చేసిన అన్ని సినిమాల్లో ఒకటి, రెండు సినిమాల ను మినహాయిస్తే మిగిలిన అన్ని సినిమాలు కూడా మంచి విజయాలు అందుకున్నాడు.