ఏపీలో ఎన్నికల హీట్ మొదలైనట్లు కనిపిస్తుంది. ఇప్పటికే వైసీపీలో కొత్త ఇంఛార్జ్ ల నియామకం వ్యవహారం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో 11 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పుపై ఆ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఎన్టీవీతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఫలితాలకు మనకు సంబంధం లేదు.. మార్పులపై విపక్షాల విమర్శలను పట్టించుకోవాలిసిన అవసరం లేదు అని ఆయన వెల్లడించారు.
Read Also: Jammu Kashmir: కాశ్మీర్‌పై డ్రాగన్ కంట్రీ కీలక వ్యాఖ్యలు.. భారత్-పాక్‌లకు సూచన..
వైఫల్యం ఒక్కటే ఇంచార్జ్ లు, ఎమ్మెల్యేల మార్పుకు కారణం కాదు అని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యనించారు. కొంత మందిపై వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే.. మార్పులు విషయంలో మొహ మాటమే లేదు అని ఆయన తేల్చి చెప్పారు. ఇద్దరు కలిసి పోటీకి వస్తున్నప్పుడు అందుకు తగ్గట్టుగా మార్పులు జరుగుతాయని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మార్పులు చేయాల్సిన చోట ఖచ్చితంగా ఉంటాం.. చెప్పే చేస్తామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా ముందు ఎమ్మెల్యే కావాల్సిందే.. కొన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించటం కోసం కొన్ని మార్పులు తప్పడం లేదు.. జగన్ మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేయాలంటే మార్పులు తప్పవు అని ఆయన వ్యాఖ్యానించారు.