NTV Telugu Site icon

YV Subbareddy: దొంగతనం చేసి జైలుకెళ్లిన చంద్రబాబు దీక్షను సత్యాగ్రహంతో పోల్చి అపవిత్రం చేయవొద్దు

Yv Subbareddy

Yv Subbareddy

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన సత్యాగ్రహ దీక్షపై వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగతనం చేసి జైలు కెళ్లిన చంద్రబాబు దీక్షను సత్యాగ్రహంతో పోల్చి అపవిత్రం చేయవొద్దు అంటూ మండిపడ్డారు. బాధలో ఉన్నప్పుడు దీక్షలు చేసుకోవచ్చు, డప్పులు కొట్టుకోవొచ్చు.. కానీ, గాంధీజీ పేరు వాడితే ఒప్పుకోం.. నాలుగు గోడల మధ్య ఎన్ని డప్పులు కొట్టిన.. టీడీపీకి మోత మోగించడానికి జనం సిద్ధంగా ఉన్నారు అని ఆయన పేర్కొన్నారు. తప్పు చేసి జైలులో ఉన్న చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం అంటే అవినీతిలో జనసేనకు బాధ్యత ఉన్నట్టేనని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

Read Also: Pakistan: భారత్ పై మరో ఆరోపణ.. ఆత్మాహుతి దాడుల వెనక రా ఉందంటున్న పాక్

చంద్రబాబు అక్రమంగా డబ్బులు దొచేశాడు కాబట్టి సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్ ఎందుకు ముందస్తుగా బెయిల్ పిటిషన్ వేశాడో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఏపీలో జరిగిన కుంభకోణాలు ఒక్కోక్కటిగా బయటకు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. లోకేశ్ ఏపీలో తప్పు చేసి.. ఢిల్లీలో తలదాచుకుంటున్నాడు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు.