YV Subba Reddy: రైతుల పక్షాన పోరాడి యూరియా కష్టాలు తీర్చటానికి కృషి చేశామని వైవి.సుబ్బారెడ్డి అన్నారు. కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. NTR జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అధ్యక్షతన జరిగిన జిల్లా వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో వైవి.సుబ్బారెడ్డి మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు మా దృష్టిలో ఉన్నాం.. ఎవరు కేసులకు భయపడాల్సిన పని లేదు.. వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. డయేరియా బాధితులను అలాగే వదిలేసిందని ఆరోపించారు. ఎవరి ఎన్ని తప్పులు చేసిన మీడియాని అడ్డుపెట్టుకొని వాస్తవాలు కప్పి పెడుతుందని తెలిపారు. జగన్ దూర దృష్టితో 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుడితే ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేస్తుందని తెలిపారు. “విద్యా వైద్యం పేదలకు అందుబాటులో ఉంచాలని జగన్ పని చేశారు.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం.. కల్తీ మద్యం చేసింది కూటమి ప్రభుత్వం.. నిందలు వేసేది మాత్రం వైసీపీ మీద.. కల్తీ మద్యం ఫ్యాక్టరీ పెట్టేశారు. గ్రామ మండల స్థాయి కమిటీలు అన్ని పూర్తి చేస్తాం. పార్టీ అధినేత జగన్ ఆదేశం ప్రకారం 29 అనుబంధ విభాగాల నియామకం జరుగుతుంది. కోటి సంతకాల సేకరణ చేస్తాం, దాని ద్వారా ప్రభుత్వం పై పోరాడతాం.” అని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.
అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగన్ తీసుకువస్తే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేస్తుంది.. దానిపై మా పోరాటం కొనసాగుతుందన్నారు. “కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఆనందం కరువు అయింది. సంక్షేమం అభివృద్ధి నీ తుంగలో తొక్కింది. వైసీపీ అభివృద్ధి కి పెద్ద పీట వేసింది,ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. NTR జిల్లాలో ఏ కార్యక్రమం చేపట్టిన వాటిని విజయవంతంగా చేశాం. 2029 లో అధికారంలోకి వచ్చేది వైసీపీ. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టిన వైసీపీకి కార్యకర్తలు అండగా ఉన్నారు. విజయవాడ ఉత్సవ పేరుతో ఎంపీ దోచుకున్నారు. ఎంపీ అంటే మనిపెకింగ్ సర్వీస్ గా పేరు మార్చేశాడు. ఐబీ పెట్టీ పారిపోయిన వ్యక్తి కేశినేని చిన్ని. హైదరాబాద్ లో ఎన్నో స్కాం లు చేశాడు చిన్ని.. జగన్ జోలికి వస్తె నీ నీచమైన బ్రతుకును బయటకు తీస్తాం..
రెడ్ బుక్ లో పేజీలు చింపితే చిరుగుతాయి మా దగ్గర ఉంది డిజిటల్ బుక్ గుర్తుపెట్టుకోండి..” అని అవినాష్ వ్యాఖ్యానించారు.
