Site icon NTV Telugu

YV Subba Reddy: సిట్ రిపోర్టులో ఉన్నదేంటి? మీరు ప్రచారం చేస్తుందేంటి?

Yv Subba Reddy1

Yv Subba Reddy1

YV Subba Reddy: సిట్ రిపోర్టులో ఉన్నదేంటి? మీరు ప్రచారం చేస్తుందేంటి అని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. సిట్‌ రిపోర్ట్‌లో జంతువుల కొవ్వు కలిసిందనేది సస్పెక్ట్‌ అని రాస్తే.. జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు ఎలా చెప్తారు? అని ప్రశ్నించారు. CFTRIకి శాంపిల్స్‌ పంపాలన్నదే తాను అని స్పష్టం చేశారు. ఎవరో పంపిన ఫిర్యాదు మీద CFTRIకి పంపింది తానే అని వెల్లడించారు. నెయ్యి సరఫరా సరిపడా లేకనే టెండర్‌ నిబంధనలు సడలించామని చెప్పారు. తాజాగా వైఎస్సార్‌సీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

READ MORE: Tollywood: తెలుగు రాష్ట్రాల్లో హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీస్.. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాప్ 10 సినిమాలివే!

“లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని సీబీఐ నిర్ధారించింది. లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారు. సిట్ విచారణతో జంతు కొవ్వు కలవలేదని నివేదికలో స్పష్టమైంది. సీబీఐ స్పష్టం చేసినా కూటమి మళ్లీ మళ్లీ విషప్రచారం చేస్తోంది. ఫ్లెక్సీలు పెట్టి వైఎస్సార్‌సీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే నెయ్యి ట్యాంకర్లు వచ్చాయి. చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. సీఎఫ్‌ఆర్‌ఐ రిపోర్టుపై కూడా మంత్రులు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు హయాం నుంచే ఎక్స్‌పర్ట్‌ కమిటీ ఉంది. టీటీడీలో నేను ఎక్కడా అవినీతికి పాల్పడలేదు. ఎలాంటి ప్రమాణం చేయడానికైనా నేను సిద్ధం. దేవుడు ముందే ప్రమాణం చేస్తా.. నేనే తప్పు చేయలేదు. సత్య శోధన పరీక్షకి సిద్ధంగా ఉన్నాను. ఎన్‌డీడీబి నుంచి కన్ఫర్మేషన్ లేకుండానే జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేయడం దుర్మార్గం. పరీక్షలు జరపాలని సీఎఫ్‌టీఆర్ఐకు లేఖ రాసిందే నేను. అలాంటప్పుడు నేను నివేదిక ఎలా తొక్కి పెడతాను. నివేదికపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదే. నెయ్యి సప్లయ్ పెంచడం కోసమే నిబంధనలు సవరించాం. నిపుణుల కమిటీ సిఫారసుల ప్రకారమే నిబంధనలు సడలించాం.” అని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

READ MORE: MVSP Collections: అల్ టైం రీజనల్ ఇండస్ట్రీ హిట్.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ జోరు మాములుగా లేదుగా!

Exit mobile version