టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు చేరింది. ఇప్పటివరకు తాను ప్రాతినిథ్యం వహించిన ఒక్క ఫ్రాంచైజీకి కూడా ఐపీఎల్ టైటిల్ అందించలేకపోయాడు. ఇప్పటివరకు యూజీ మూడు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున ఫైనల్స్ ఆడినా.. ట్రోఫీ మాత్రం అందుకోలేదు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నా.. ఐపీఎల్ టైటిల్ మాత్రం చహల్ ఖాతాలో లేదు. దాంతో మూడు ఫైనల్స్ ఆడినా.. కప్ గెలవని తొలి ఆటగాడిగా ఐపీఎల్ చరిత్రలో నిలిచాడు.
Also Read: Chinnaswamy Stadium Stampede: మృతుల కుటుంబాలకు 20 కోట్లు ఇవ్వాలి!
యుజ్వేంద్ర చహల్ 2013లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. 2016లో ఆర్సీబీ తరఫున మొదటిసారి ఫైనల్ ఆడాడు. ఆ మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఆర్సీబీ ఓడిపోయింది. 2022లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఫైనల్‌లో బరిలోకి దిగగా.. గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. 2025లో పంజాబ్ కింగ్స్ తరఫున ఫైనల్ ఆడగా.. ఆర్సీబీ జయకేతనం ఎగురవేసింది. మూడు ఫైనల్స్‌లో చహల్ ఆటగాడిగా రాణించినా టైటిల్ మాత్రం అందని ద్రాక్షగానే ఉంది. యూజీ 174 ఐపీఎల్ మ్యాచులలో 221 వికెట్స్ పడగొట్టాడు. ఐపీఎల్ 2025లో చహల్ 14 మ్యాచ్‌ల్లో 16 వికెట్స్ పడగొట్టాడు. ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన 4/28.
